31.2 C
Hyderabad
May 29, 2023 22: 05 PM
Slider కృష్ణ

ఏపీ పోలీసులపై ఫిర్యాదులకు కంప్లైంట్స్‌ అథారిటీ ఏర్పాటు

#AP Police

రాష్ట్రంలోని పోలీసులపై వచ్చే ఫిర్యాదులను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీ సభ్యులుగా ముగ్గురు రిటైర్డు ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.అథారిటీ సభ్యులుగా రిటైర్డు ఐఎఎస్‌ ఉదయలక్ష్మి, రిటైర్డు ఐపిఎస్‌ అధికారులు కెవిబి గోపాలరావు,బత్తిన శ్రీనివాసులును ప్రభుత్వం నియమించింది.

వీరు పోలీసులపై వచ్చే ఫిర్యాదులను నమోదు చేసుకుని విచారణ చేస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు విశాఖపట్నం,కృష్ణా, పశ్చిమ గోదావరి,తూర్పు గోదావరి జిల్లాలకు రాజమండ్రి, గుంటూరు, ప్రకాశం,నెల్లూరు జిల్లాలకు గుంటూరు,రాయలసీమ జిల్లాలకు కర్నూలు కేంద్రంగా కమిటీలను ఏర్పాటు చేసింది.

ప్రతి కేంద్రంలో ముగ్గురు రిటైర్డు డిఎస్‌పి,అడిషనల్‌ ఎస్‌పి స్థాయి అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Related posts

త్రీ ఈడియట్స్: మైనర్ బాలికపై అత్యాచార యత్నం

Satyam NEWS

హ్యాట్సాఫ్: పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివి

Satyam NEWS

ATM మోసాలకు చెక్‌ పెట్టేందుకు ఇక ఓటీపీ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!