Slider తెలంగాణ

రిజర్వేషన్లను దెబ్బతీసే కుట్ర జరుగుతోంది

kadiyam

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సామాజిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తే కొన్ని స్వార్థపర శక్తులు మతాలు, కులాల, ఆర్థిక, ప్రాంతీయ ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ లక్ష్యం ఆధారంగా బాబా సాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించారో దానిని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి అంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎంఎల్ సి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. అరుంధతీయ బంధు సేవా మండలి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నేడు నిర్వహించిన దసరా మిలాప్-2019 వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. మన ఆహార అలవాట్లను అవహేళన చేస్తున్నారు, మనం గోమాంసం తినేవాళ్ళమని అంటున్నారు. మన రిజర్వేషన్లు, మన ఆహార అలవాట్లు, మన సంస్కృతి, జీవన విధానాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటిని మనం సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మనం ఐక్యంగా ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ దసరా మిలాప్ సందర్భంగా ఇలా కలుసుకొని సమస్యలపై చర్చించుకోవడం ఒక మంచి అవకాశం గా భావిస్తున్నానని ఆయన అన్నారు. భవిష్యత్ లో కూడా ఇలాంటి సమావేశాలు మరిన్ని జరగాలని, నిర్వాహకులు ఎన్నో వ్యయ, ప్రయాసలకు ఓర్చి గత కొన్నేళ్లుగా ఈ ఉత్సవాలను జరుపుతుండడాన్ని అభినందిస్తున్నాను అన్నారు. ఈ సందర్బంగా రూపొందించిన ప్రత్యేక సంచికను ఆయన విడుదల చేశారు.

Related posts

వేడుకలకు దూరంగా…ప్రజలకు దగ్గరగా….!

Satyam NEWS

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి గా బండి

mamatha

ఇంటర్ డిస్టిక్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోస్టర్ విడుదల

mamatha

Leave a Comment