37.2 C
Hyderabad
March 29, 2024 21: 10 PM
Slider జాతీయం సంపాదకీయం

నీతులు చెప్పే చిదంబరం ఏం చేశాడు?

Chidambaram

షీనా బోరా హత్య కేసు గుర్తు ఉంది కదా? అందులో ప్రధాని నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా. ఇంద్రాణి ముఖర్జియా ఆమె భర్త పీటర్ ముఖర్జియా లకు చెందిన కంపెనీ ఐఎన్ఎక్స్ మీడియా. ఈ కంపెనీ తన వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవడానికి విదేశాల నుంచి నిధులు (ఫారెన్ డైరెక్ట్ ఇన్వెష్టమెంట్) తెచ్చుకోవాలని భావించింది. దీనికోసం ఫారెన్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్ఐపీబీ) అనుమతి కోరింది. ఒక్కో షేర్‌ను 10 రూపాయల ముఖ విలువతో విదేశీ కంపెనీల వారికి జారీ చేస్తామని ఐఎన్ఎక్స్ మీడియా ఎఫ్ఐపీబీకి పేర్కొంది. దీంతో ఐఎన్ఎక్స్ మీడియాలోకి 4 కోట్ల 62 లక్షల విదేశీ పెట్టుబడులకు ఎఫ్ఐపీబీ అనుమతి ఇచ్చింది. అదే సమయంలో ఐఎన్ఎక్స్ న్యూస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థలోకి డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి విడిగా అనుమతి తీసుకోవాలని ఎఫ్ఐపీబీ స్పష్టంగా చెప్పింది. డౌన్ స్ట్రీమ్ ఇన్వెస్ట్ మెంట్ అంటే తాను తెచ్చుకున్ననిధులను తమకు లేదా ఇతరులకు చెందిన వేరే కంపెనీలకు మళ్లించడం అన్నమాట. దీనికి అంగీకరించిన ఐఎన్ఎక్స్ మీడియా ఆ తర్వాత దీన్ని ఉల్లంఘించింది. ఎఫ్ఐపీబీ సిఫార్సుతో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థ దరఖాస్తుకు అప్పటి కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఐఎన్ఎక్స్ మీడియా ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘించి, ఐఎన్ఎక్స్ న్యూస్‌ సంస్థలో 26శాతం డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్‌ చేసిందని సీబీఐ తన ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం ఎఫ్ఐపీబీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉన్నా ఐఎన్ఎక్స్ మీడియా ఆ పని చేయలేదు. 4 కోట్ల 62 లక్షల రూపాయల విదేశీ పెట్టుబడులకు ఎఫ్ఐపీబీ అనుమతి ఇచ్చింది కదా. అయితే ఆ కంపెనీ సేకరించిన నిధులు ఎంతో తెలుసు కదా? రూ.305 కోట్లు. ముందు చెప్పినట్లు విదేశీ పెట్టుబడిదారులకు ఒక్కో షేర్‌ను 10 రూపాయలకు కేటాయించాల్సి ఉండగా 800 రూపాయలకు ఒక షేర్ జారీ చేసింది. ఈ అవకతవకలన్నీ ఆదాయపు పన్ను శాఖ వారికి ఫిర్యాదు రూపంలో అందాయి. దాంతో ఆదాయపు పన్ను శాఖ వారు నోటీసులు జారీ చేశారు. 2008 ఫిబ్రవరిలో దీనిపై వివరణ ఇవ్వాలని ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఎఫ్ఐపీబీని కూడా కోరారు. దీంతో తాము కూడా ఈ వ్యవహారంపై సమాంతరంగా దర్యాప్తు చేస్తామని ఐటీ శాఖకు ఎఫ్ఐపీబీ సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు లేఖ రాసింది. ఎఫ్ఐపీబీ నుంచి లేఖ అందుకున్న ఐఎన్ఎక్స్ మీడియా కు చెందిన ఇంద్రాణి 2008 లో అప్పటి ఆర్ధిక శాఖ మంత్రి పి.చిదంబరం ను కలిసింది. కేసు నుంచి బయట పడేందుకు తన కుమారుడు కార్తీ ని కలవాల్సిందిగా చిదంబరం ఆమెను కోరాడు. దాంతో ఇంద్రాణి వెళ్లి కార్తీని కలిసింది. తన సంస్థ అయిన చెస్ మేనేజిమెంట్, ఎడ్వాంటేజ్ స్టాటజిక్ అనే కంపెనీలకు రూ.10 లక్షలు చెల్లించాల్సిందిగా కార్తీ కోరాడు. ఇంద్రాణి, పీటర్ లు ఈ మేరకు చెల్లింపులు చేయడంతో కార్తీ రంగంలోకి దిగాడు. ఆ తర్వాత చెస్‌ మెనేజ్‌మెంట్ సర్వీసెస్ సూచించినట్లుగా ఐఎన్ఎక్స్ మీడియా ఎఫ్ఐపీబీకి లేఖ రాసింది. అన్ని వ్యవహారాలు సక్రమంగానే జరిగాయంటూ వివరణ ఇచ్చింది. కార్తీ చిదంబరం ఒత్తిడితో ఈ కేసును ఎఫ్ఐపీబీ అధికారులు చూసీ చూడనట్లు వదిలేశారు. ఐఎన్ఎక్స్ మీడియా ను కేసుల నుంచి బయట పడేసేందుకు అన్ని రకాలుగా తన తండ్రి పదవిని కార్తీ వినియోగించుకున్నాడు. నిబంధనలు అతిక్రమించినందుకు చర్యలు తీసుకోకపోగా ఆ సంస్థకు మేలు చేసేందుకు ఆర్థిక శాఖ అధికారులు ప్రయత్నించారు. ఐఎన్ఎక్స్ న్యూస్‌ సంస్థలోకి ఇదివరకే వచ్చిన డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్‌ అనుమతి కోసం కొత్తగా ఎఫ్ఐపీబీకి దరఖాస్తు చేయాలని సూచించారు. అధికారులు చెప్పినట్లు ఐఎన్ఎక్స్ మీడియా అప్లికేషన్ పెట్టడం, ఎఫ్ఐపీబీ ఆమోదించడం జరిగిపోయాయి. ఈ వివాదం నుంచి బయటపడేసినందుకు కార్తీ చిదంబరం ఆధ్వర్యంలో నడుస్తున్న చెస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌కి ఐఎన్ఎక్స్ మీడియా డబ్బులు చెల్లించింది. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని ఐఎన్ఎక్స్ మీడియా నుంచి కార్తీ దాదాపుగా రూ.54 కోట్లు వసూలు చేశాడు. ఈ సొమ్ముతో కార్తీ స్పెయిన్ లో ఒక టెన్నిస్ క్లబ్ ను కొనుగోలు చేశాడు. లండన్ లో కాటేజీలు కొన్నాడు. ఇండియా లో కూడా చాలా ఆస్తులు కొనుగోలు చేశాడు. ఒక ఇంగ్లీష్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు రావడం దానిపై సిబిఐ ప్రాధమిక దర్యాప్తు చేయడం జరిగిపోయాయి. దాంతో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థపై 2017 మే 15న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా, ఐఎన్ఎక్స్ ప్రెస్, చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, ఆయన ఆధ్వర్యంలో పనిచేసే చెస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు, మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులను ఇందులో నిందితులుగా సీబీఐ పేర్కొంది. ఈ ఎఫ్‌ఐఆర్‌లో చిదంబరం పేరు లేదు. అయితే షీనా బోరా మర్డర్ కేసులో జైల్లో ఉన్న ఇంద్రాణీ ముఖర్జియా ఆ తర్వాతి కాలంలో ఎప్రూవర్ గా మారిపోయింది. అప్పుడు చిదంబరం పేరు చెప్పింది. లిఖిత పూర్వకంగా సిబిఐకి ఫిర్యాదు కూడా ఇచ్చింది. దాంతో చిదంబరం పై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చిదంబరం ఢిల్లీ హైకోర్టులో అపీల్ చేశారు. అయితే, ఆయన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో చిదంబరం తరఫున ఆయన లాయర్లు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌ రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై తక్షణం విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఇదే సమయంలో తమ వాదన వినకుండా చిదంబరానికి ముందస్తు బెయిల్ మంజూరు చేయరాదని సుప్రీంకోర్టులో సీబీఐ కెవియట్ దాఖలు చేసింది. ఈ కేసులో 2018 ఫిబ్రవరిలో కార్తీ చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇప్పుడు తండ్రి అరెస్టు అయ్యాడు.

Related posts

వైకాపా రాక్షస పాలన అంతం చేసేందుకు మేం రెడీ

Satyam NEWS

జగన్ సర్కార్ పనితీరుపై ఎన్నికల సంఘం సీరియస్

Satyam NEWS

ఎర్ర చందనం స్మగ్లర్ భాస్కరన్ పై పిడి చట్టం

Satyam NEWS

Leave a Comment