36.2 C
Hyderabad
April 25, 2024 19: 54 PM
Slider ఖమ్మం

అన్నదాతకు అండగా టీఆర్ఎస్‌ ప్రభుత్వం

puvvada

కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో తీసుకువస్తున్ననూతన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు రైతుల దీక్షకు మద్దతుగా రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ ఖమ్మం జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి సర్కిల్లో రైతులతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, జై జవాన్-జై కిసాన్ అంటూ రైతులతో కలిసి నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ..దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇలా చీకటి చట్టాలను తెచ్చి వారిని ప్రమాదంలోకి నెట్టడం సరికాదన్నారు. గ్లోబల్ వ్యాపారం పేరుతో కేంద్ర ప్రభుత్వం భారతదేశ రైతులను అధోగతి పాలు చేసే ప్రయత్నం చేస్తోందని, దేశానికే కాదు, ప్రపంచానికే ఆహార ధాన్యాలు ఎగుమతి చేస్తున్నభారతదేశ రైతులు, ఇప్పుడు కేంద్రం తెచ్చే గ్లోబల్ వ్యాపార కొత్త వ్యవసాయ చట్టంతో పండించిన పంటలు అమ్ముకోలేక రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సి దుస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలాంటి రైతు వ్యతిరేక చట్టాన్ని రైతులతో పాటు అన్నిపార్టీలు, ప్రజాస్వామిక వాదులు అందరూ తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూనే, రాష్ట్రంలో సీఎం కేసిఆర్ వ్యవసాయానికి సాయంగా, రైతన్నకు వెన్ను దన్నుగా, రైతుల ఆత్మ బంధువుగా, చేపట్టిన అనేకానేక పథకాలను తీసుకొచ్చారన్నారు. రైతుల వెంటే కేసీఆర్ అని, నో ఫార్మర్-నో ఫుడ్, రైతు లేనిదే రాజ్యం లేదు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం-రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్లు చరిత్రలో జరగలేదన్నారు.

కేంద్ర ప్రభుత్వ కొత్త వ్యవసాయ బిల్లు, నూతన విద్యుత్ బిల్లుల వల్ల నష్టాలను రైతులకు వివరించారు. రైతుల ఆందోళనకు భేషరతుగా మద్దతు పలికిన సీఎం కెసిఆర్ వల్లే దేశం బాగు పడుతుందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చిచెప్పారు. అనంతరం ఎద్దుల బండి బై నిల్చిని నల్ల జెండాతో నిరసన వ్యక్తం చేశారు.

దీక్షలో కూర్చున్నమంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు మద్దతుగా రైతు సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ పల్లా రాజేశ్వర రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, మేయర్ పాపాలాల్, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు సంఘీభావం తెలిపారు.

ఈ కార్యక్రమంలోపార్టీ రాష్ట్ర కార్యదర్శి తాత మధు తెరాస పార్టీ కార్యాలయ ఇంచార్జి ఆర్జేసీ కృష్ణ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, కార్పొరేటర్లు, మండల రైతు సమితి నాయకులు, టీఆర్ఎస్ కెవి వివిధ అనుబంధ సంఘాలు, వివిధపార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Related posts

ఆల్ సేఫ్ :పడవ బోల్తా 25మందిని కాపాడిన ఈతగాళ్లు

Satyam NEWS

అడుగులు తడబడుతున్నా… ఆశతోనే అందరూ…

Satyam NEWS

విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాల ర్యాలీ

Bhavani

Leave a Comment