36.2 C
Hyderabad
April 23, 2024 20: 19 PM
Slider నిజామాబాద్

ఫౌల్ ప్లే: పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల ఆందోళన

trs leaders

కామారెడ్డి మున్సిపాలిటీలోని 26 వ వార్డు గంజ్ మార్కెట్ యార్డులో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పోలింగ్ బూత్ లోకి అధికార పార్టీ నాయకుడొకరు ఓటర్ జాబితాను మాటిమాటికి లోపలికి, బయటకు తీసుకెళ్తున్నాడని, ఓటు ఎవరు వేయలేదో తెలుసుకుని వారికి అనుకూలంగా ఓట్లు వేయించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.

ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటరు జాబితా బయటకు ఎలా వస్తుందని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులకు అధికారులు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. దాంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు సముదాయించే ప్రయత్నం చేసినా అభ్యర్థులు వినిపించుకోలేదు. దాంతో పోలీసులకు, అధికారులకు, అభ్యర్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

కొద్దిసేపటి తరువాత ఆందోళన చేస్తున్న వారిని సముదాయించి అక్కడినుంచి పంపించారు పోలీసులు. అలాగే 37 వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారని బీజేపీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం దొంగ ఓటు వేయకపోతే ఛాలెంజ్ ఓటు వేసి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. రిటర్నింగ్ అధికారి ఎల్లయ్యతో వాగ్వాదానికి దిగారు. జిల్లా అధికారులు పత్రికల్లో ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారమే తాము అడుగుతున్నామని, దొంగ ఓటు వేయడం లేదని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

కాణిపాకం చైర్మన్ పీఠం దక్కేది ఎవరికి ?

Satyam NEWS

ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల

Sub Editor 2

సైబరాబాద్ లో ఆపరేషన్ స్మైల్ VIII ప్రారంభం

Satyam NEWS

Leave a Comment