29.2 C
Hyderabad
March 24, 2023 21: 46 PM
Slider ప్రత్యేకం

ఉప్పల్ భగాయత్లో వంజర సంఘం భవనానికి శంకుస్థాపన

#Minister Gangula Kamalakar

వెనుకబడిన వర్గాలు వెనకబడలేదని, వెనుకకు నెట్టేయబడ్డారని ఆవేదన వ్యక్తం చేసారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఈరోజు ఉఫ్పల్ భగాయత్లో వంజర సంఘం భవనానికి సహచర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ 75ఏళ్ల స్వాతంత్ర్య భారత చరిత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే బీసీ సంక్షేమాన్ని పట్టించుకున్నారని, చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో 41 కుల సంఘాలకు వేల కోట్ల విలువైన 87.3 ఎకరాలు కేటాయించి ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నారన్నారు.

గత ప్రభుత్వాల్లో కుల సంఘ భవనాలు నిర్మించుకుంటామని ఎమ్మెల్యేగా ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా గుంట జాగా కూడా కేటాయించలేదని నేడు సీఎం కేసీఆర్ బీసీ పక్షపాత దోరణితో రాజదాని నడిబొడ్డున బీసీ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేస్తున్నామన్నారు.

ఆదివారం రోజున ఇదే ఉప్పల్ భగాయత్లో మరో 13 బీసీ కుల సంఘాల భవనాల నిర్మాణాలను ప్రారంభిస్తున్నామని, దసరా నాటికల్లా, వసతి, కమ్యూనిటీ హాల్, మీటింగ్ రూం, లైబ్రరీ, సకల రిక్రియోషన్ సధుపాయాలతో బీసీ ఆత్మగౌరవ భవనాలను ప్రారంభించుకుంటామన్నారు మంత్రి గంగుల.

ఉప్పల్ భగాయత్, కోకాపేటల్లో బీసీ ఆత్మగౌరవ భవనాలకు కేటాయించిన ప్రాంతాల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, కరెంటు వంటి మౌళిక సధుపాయాల్ని ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. రేపటి కార్యక్రమాల్లో ఆయా కుల సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి గంగుల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పాటు స్థానిక అధికారులు, వంజర సంఘం నేతలు పాల్గొన్నారు.

Related posts

బాలివుడ్ ఛాన్సు కొట్టేసిన రష్మిక

Satyam NEWS

కడప జిల్లాలో సైకిల్ కు పెద్ద పంక్చర్

Satyam NEWS

సరిహద్దుల్లో మొహరించి ఉన్న ఎయిర్ ఫోర్స్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!