30.7 C
Hyderabad
April 19, 2024 09: 58 AM
Slider నల్గొండ

మన ఊరు-మన బడి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

#sidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి శుక్రవారం హుజూర్ నగర్ పట్టణం లోని 2,5,24వ,వార్డుల లోని ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమము ద్వారా మంజూరైన నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో యావత్ దేశంలోనే తెలంగాణ పాఠశాలల నిష్పత్తిలో ప్రధమ స్థానంలో వున్నదని అన్నారు.విద్యకు అత్యధిక ప్రాధాన్యత  ఇస్తూ రాష్ట్రంలో అనేక కొత్త పాఠశాలను నెలకొల్పుతూ ప్రభుత్వ విద్యను ప్రజలకు అందుబాటులోకి తెస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా శాసనసభ్యుడు విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులను పలు విషయాలు అడిగి వారి ఆసక్తిని తెలుసుకున్నారు.విద్యార్థులకు చదువు,సమాజం,జీవితం మీద  అవగాహన కల్పించారు.విద్యార్థులతో మాట్లాడుతూ కేవలం మార్కులు ఒక్కటే జ్ఞానానికి కొలమానం కాదని,చదవడం అంటే పుస్తకాలను మాత్రమే చదవడం కాదని,చదువు జీవితాన్ని గెలవడానికి ఒక సాధనంగా ఉపయోగ పడుతుందని అన్నారు.చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ ని కూడా నేర్చుకోవాలని,విద్యార్థులు తప్పకుండా స్వల్పకాలిక,దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధనకు నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉండాలని తెలిపారు.అదే విధంగా కన్న తల్లిదండ్రుల యొక్క కలలను,ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రయత్నాలు కొనసాగించాలని, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరముగా ఉండాలని సూచించారు.  

మాజీ భారత రాష్ట్రపతి మిస్సైల్ మాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలను, ఆదర్శాలను విద్యార్థులు సాధించే దిశగా ఎదగాలని కోరారు.విద్యార్థులు ప్రపంచ జ్ఞానాన్ని సమపాదించుకొని స్థానికంగా జీవితంలో విజయాన్ని సాధించాలని, తెలంగాణ ప్రభుత్వం ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థిని ప్రోత్సహిస్తుందని,భుజం తట్టి వారిలో ధైర్యాన్ని పెంపొందిస్తూ కావలసిన ఆర్థిక సహాయాన్ని కూడా ఇస్తుందని అన్నారు.

హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలోని వరదాపురం గ్రామానికి చెందిన ఒక బాలికకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ స్వయంగా 2 లక్షల రూపాయల ఫీజులు చెల్లించి విశాఖపట్నంలో జాతీయ కోచింగ్ అకాడమీలో ఆ విద్యార్థినికి కోచ్ గా రాణించడంలో శిక్షణ ఇప్పిస్తున్నారని,ఈ విధంగా విద్యార్థులు సంపూర్ణ అవగాహనతో పరిపూర్ణమైన పౌరులుగా సమాజంలో అడుగు పెట్టాలని శానంపూడి సైదిరెడ్డి కోరారు.

మన ఊరు,మనబడి కార్యక్రమంలో భాగంగా హుజూర్ నగర్ పట్టణంలోని ఐదవ వార్డులోని బాలుర ఉన్నత పాఠశాలలో50.5 లక్షల రూపాయలతో  అభివృద్ధి పనులను,24వ,వార్డులోని సితారాంనగర్ లోని ప్రైమరి పాఠశాలలో 25 లక్షల రూపాయలతో పనులను,2వ, వార్డు లోని ప్రైమరి పాఠశాలలో 19.7 లక్షల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేశారు.ఈ నిధులతో అదనపు గదులు,శౌచాలయాలు  నిర్మాణం,వాటర్ ట్యాంక్,వాటర్ పైప్ లైన్యింగ్, ప్రహరీ గోడ,భోజనశాల,వంట గది, ఫ్లోరింగ్ లాంటి పనులు చేపట్టనున్నారు.

ఈ కార్యక్రమములో హుజూర్ నగర్ పట్టణ,మండల ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

అపర చాణక్యుడు పి వి కి భారతరత్నఇవ్వాలి

Satyam NEWS

మైదానంలో మళ్లీ స్టెప్పులేసిన కోహ్లీ

Sub Editor

ఆరోగ్య శాఖ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి

Satyam NEWS

Leave a Comment