31.7 C
Hyderabad
April 18, 2024 23: 30 PM
Slider విజయనగరం

500 కోట్ల తో మెడికల్ కాలేజీ వర్చువల్ శంకుస్థాపన

#medical college

ఏపీ రాష్ట్ర మంతటా ఒకే సారి అదీ వర్చువల్ విధానం ద్వారా 14 మెడికల్ కాలేజీ లను సీఎం జగన్ తాడేపల్లి నుంచీ ప్రారంభించారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రం లో గాజులరేగ వద్ద 70 ఎకరాల్లో 500 కోట్ల తో నిర్మాణం కానున్న మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి ,ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు శంబంగి ,బడుకొండ ,రాజన్నదొర ,బొత్స అప్పల నరసయ్యలతో పాటు ఎమ్మెల్సీ పెనుమత్స అదే విధంగా జిల్లా కలెక్టర్ డా్హరిజవహర్ లాల్ పాల్గొన్నారు.

విజయనగరం జిల్లా కేంద్రంలో గాజుల రేగలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన జరిగింది. రాష్ట్ర సీఎం జగన్ వర్చువల్ విధానంలో ఈ శంకుస్థాపన గావించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, ఎంపీలు బెల్లాన చంద్ర శేఖర్, గొట్టేటి మాధవి, ఎమ్మెల్సీలు పి. సురేష్ బాబు, ఎమ్మెల్యేలు బొత్స అప్పల నర్సయ్య, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు, అలజంగి జోగరావు, విజయనగరం మేయర్ వి విజయ లక్ష్మి,లు పాల్గొన్నారు.

40 మంది తో బందోబస్తు.

ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో 40 మంది పోలీస్ సిబ్బంది తో బందోబస్తు నిర్వహించారు. ఈ బందోబస్తు లో డీఎస్పీ అనిల్ ,భోగాపురం సీఐ శ్రీథర్ ,రూరల్ సీఐ మంగవేణి ,టూటౌన్ సీఐ శ్రీనివాసరావు లు పాల్గొన్నారు.

Related posts

విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్‌ను ప్ర‌త్యేకంగా అభినందించిన మంత్రి బొత్స

Satyam NEWS

ఘనంగా మాలమహానాడు వ్యవస్థాపకుడు పివి రావు వర్ధంతి

Satyam NEWS

ఉత్సాహం పై నీళ్లు చల్లిన అమిత్ షా

Satyam NEWS

Leave a Comment