26.7 C
Hyderabad
June 22, 2024 04: 56 AM
Slider ముఖ్యంశాలు

హైకోర్టు ఎదుట హాజరైన మరో నలుగురు ఐఏఎస్ అధికారులు

#APHighCourt

కోర్టు ధిక్కార కేసుల్లో తలమునకలై ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారులలో నలుగురు నేడు ఏపి హైకోర్టు ఎదుట హాజరయ్యారు.

కోర్టు ధిక్కార కేసు లో హైకోర్టుకు నలుగురు ఐఏఎస్ లు ఒకే రోజు హాజరు కావడం ఒక ప్రత్యేకతగా చెప్పవచ్చు.

హైకోర్టుకు హాజరైన వారిలో పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రెటరీ జనార్ధన ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, పురపాలక శాఖ సెక్రటరీ శ్రీ లక్ష్మి,  ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఉన్నారు.

పాఠశాలల భవనాలలో రైతు భరోసా కేంద్రాలు, పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయం నిర్మాణం పై హై కోర్టులో ధిక్కర  కేసు విచారణ జరిగింది.

స్కూల్ ఆవరణలో భవనాలు నిర్మించవద్దని ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పేద పిల్లలు చదువుకునే స్కూల్ లో వాతావరణం కలుషితం చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీలో ఎవరైనా ఈ పాఠశాలలో చదువుకున్నారా అని హైకోర్టు జడ్జి దేవానంద్ అధికారులను ప్రశ్నించారు.

హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా నిర్మాణాలు ఎందుకు కొనసాగుతున్నాయని న్యాయమూర్తి ప్రశ్నించారు. పాఠశాల ఆవరణ లోకి రాజకీయాలు ఎందుకు తీసుకెళ్తారని హై కోర్టు ప్రశ్నించింది.

కేసు తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసింది. ఆగస్టు 31న కూడా అధికారులంతా హాజరుకావాలని ఏపీ హైకోర్టు ఆదేశం ఇచ్చింది.

Related posts

కరోనాతో తొలి తెలుగు జర్నలిస్టు మరణం

Satyam NEWS

ధూప దీపాలకూ నోచుకోని కల్యాణ వేంకటేశుడు

Satyam NEWS

విజయానికి సృజన ఒక్కటే చాలదు కృషి అవసరం

Satyam NEWS

Leave a Comment