30.7 C
Hyderabad
April 24, 2024 00: 45 AM
Slider సంపాదకీయం

ఆంధ్రా స్థాయికి చేరిన తెలంగాణ: అర్ధం కాలేదా? ఇది చదవండి

#kodali nani

ఆంధ్రాలో అత్యంత నీచంగా కులాల పేరుతో తిట్టుకుంటారు. వయసులో పెద్ద వారైనా సరే చూడకుండా నోటికి వచ్చినట్లు వాడూ…. వీడూ అనడం కూడా అలవాటే. మొదట్లో ఈ అలవాటును జీర్ణించుకోవడానికి సమయం పట్టినా ఇప్పుడు ఆంధ్రా ప్రజలకు ఈ నీచ భాష వాడే రాజకీయ నాయకులు అలవాటైపోయారు.

అక్కడ ఈ రాజకీయ నాయకులు వాడే భాష సర్వ సాధారణం అయిపోయింది… అంటే బూతులు మాట్లాడటమే రాజకీయం అయిపోయింది. అలాంటి వారు తెలంగాణలో లేకపోవడం నిన్న మొన్నటి వరకూ ఒక పెద్ద లోపంగా కనిపించింది. తెలంగాణ రాజకీయ నాయకులు రాజకీయ ఆరోపణలు తప్ప పెద్దగా బూతులు మాట్లాడటం లేదు.

ఇది ఒక పెద్ద లోపంగా కనిపించింది. చూడండి… ఆంధ్రాలో ఎంత చక్కగా రాజకీయ నాయకులు ‘‘నీ యమ్మ మొగుడు’’ లాంటి పదాల నుంచి ఇక్కడ రాయలేని పదాల వరకూ మాట్లాడుకుంటారో… మన రాష్ట్రంలో అలాంటి వారే లేరా? అంటూ ఆవేదన చెందిన వారికి ఇప్పుడు ఆ లోటు కూడా తీరింది.

ఆంధ్ర రాజకీయ నాయకుల స్థాయికి ఒకే సారి తెలంగాణ రాజకీయ నాయకులు కూడా వచ్చేశారు. ఆ లోటు తీర్చిన మొదట్టమొదటి వ్యక్తి మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. రాజకీయాలలో ఎంతో చురుకుగా ఉండే మైనంపల్లి హనుమంతరావు ఇప్పుడు ఆంధ్రాలో మంత్రి కొడాలి నాని స్థాయికి చేరారు.

అక్కడ కొడాలి నాని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడిని అత్యంత దారుణంగా తిడుతుంటారు. ఉచ్ఛంనీచం లేకుండా మంత్రి స్థాయిని కూడా మరచిపోయి ఆయన మాట్లాడే మాటలను చాలా మంది ముందుగా కొత్తగా చూసినా ఇప్పుడు వాటికి అలవాటు పడిపోయారు.

మంత్రి నాని తన శాఖ గురించి మాట్లాడితే కొత్తగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు తెలంగాణ లో మైనంపల్లి హనుమంతరావు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు అయిన బండి సంజయ్ ని అత్యంత దారుణంగా తిట్టారు…. ఇంకా తిడుతూనే ఉన్నారు.

మైనంపల్లి మాట్లాడిన ఏ మాటా కూడా ఇక్కడ రాయలేని స్థాయిలో ఉండటం వల్ల ఉదాహరణ చెప్పలేకపోతున్నందుకు కొంచెం వెలితిగానే ఉంది. పాపం అక్కడ చంద్రబాబు కానీ ఇక్కడ బండి సంజయ్ కానీ ఆ స్థాయిలో బూతులు మాట్లాడలేక వెనుకబడుపోయారు.

ఇప్పటికి చాలా కాలం నుంచి మంత్రి కొడాలి నాని బూతులు మాట్లాడుతున్నా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వారించినట్లు కనిపించలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాటలోనే నడిచి మైనంపల్లి హనుమంతరావును మరింత పెద్ద స్థాయికి తీసుకువెళ్లతారో లేక బూతులు మాట్లాడవద్దు అంటూ కంట్రోల్ చేస్తారో వేచి చూడాలి.

గత నాలుగైదు రోజులుగా అయితే కేసీఆర్ ఆయనను కంట్రోల్ చేస్తున్నట్లు కనిపించలేదు. బూతులను ఆస్వాదించే వారు ఆంధ్రా స్థాయికి తెలంగాణ కూడా రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉండి ఉంటారు…….

Related posts

ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి కావాలి

Murali Krishna

మంత్రి గంగుల తండ్రి మల్లయ్య మృతి

Satyam NEWS

వైఎస్ ఆర్ సి పి నాయకుని ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment