27.7 C
Hyderabad
April 25, 2024 07: 45 AM
Slider విజయనగరం

మోటారు సైకిళ్ళు దొంగతనం కేసుల్లో నలుగురు నిందితులు అరెస్టు

#vijayanagarampolice

విజయనగరం పట్టణం పరిధిలో ఇటీవల జరిగిన మోటారు సైకిళ్ళు దొంగతనం కేసుల్లో నలుగురు ముద్దాయిలను విజయనగరం వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుండి నాలుగు మోటారు సైకిళ్ళును (2 పల్సర్ మోటారు సైకిళ్ళు, ఒక గ్లామర్ బైక్, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్) స్వాధీనం చేసుకున్నట్లుగా విజయనగరం సబ్ డివిజన్ ఇన్చార్జ్ డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

ఇటీవల మోటారు సైకిళ్ల చోరీ కేసులను చేధించుటకు విజయనగరం జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆదేశాలతో విజయనగరం టౌన్ ఇన్స్పెక్టర్ బి.వెంకటరావు ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందం ఈ తరహా నేరాలకు పాల్పడే పాత నేరస్థులపై నిఘా పెట్టింది. ఇందులో భాగంగా వన్ టౌన్ ఎస్ఐ వి. అశోక్ కుమార్ మరియు సిబ్బంది నవంబరు 18న కె.ఎల్.పురం జంక్షన్ వద్ద మద్యాహ్నం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి రాయల్ ఎన్ఫీల్డ్ మెటారు సైకిల్ పై గజపతినగరం వైపు వెళ్తుండగా, సదరు వ్యక్తిని పోలీసులు ప్రశ్నించగా, సదరు వాహనం గురించి అతను చెప్పిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో అనుమానంతో, మరింత లోతుగా విచారణ చేసారు.

విచారణలో సదరు పొటిపిరెడ్డి నవీన్ (ఎ-1) తాను మోటారు సైకిళ్ళును దొంగతం చేసి, తన స్నేహితుడు శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం, పురుషోత్తంపురంకు చెందిన వంకల రవి (ఎ-2) ద్వారా విక్రయిస్తుంటానని తెలిపారు. ఎపి 38 జెఎఫ్ 5637ను విక్రయించాలనే ఉద్దేశ్యంతో తాను వంకల రవిని (ఎ-2)ను విజయనగరం రమ్మనమని కోరినట్లు, సదరు వ్యక్తికి ఎన్ ఫీల్డ్ ఇచ్చి అమ్మే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడినట్లుగా తెలిపారు. (ఎ-1) పొటిపిరెడ్డి నవీన్ ఇచ్చిన సమాచారంతో (ఎ-2) వంకల రవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారణ చేయగా, నిందితులు దొంగిలించిన మోటారు సైకిళ్ళుకు శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం, గొల్ల కంచిలి గ్రామానికి చెందిన (ఎ-3) కొల్లి కిరణ్ కుమార్, సోంపేటకు చెందిన (ఎ-4) సామంతుల సుదర్శన్ సహకారంతో నకిలీ రిజిస్ట్రేషను డాక్యుమెంట్లును సృష్టించి, చోరీ వాహనాలను కొనుగోలుదారులకు ఎటువంటి అనుమానం రాకుండా విక్రయిస్తున్నట్లుగా తెలిపారన్నారు.

నిందితులు నలుగురు ఒక గ్రూపుగా ఏర్పడి, నేరాలకు పాల్పడుతున్నట్లుగా విచారణలో వెల్లడయ్యిందని డిఎస్పీ తెలిపారు. (ఎ-1) నవీన్ మోటారు సైకిళ్ళును చోరీ చేసి, వాటి ఫోటోలను (ఎ-2) రవికి వాట్సాప్ పంపగా, సదరు బైకు నంబరు ప్లేటు ఆధారంగా, వాహన యాజమాని డూప్లికేటు రిజిస్ట్రేషను పివిసి కార్డులను (ఎ-3) కిరణ్ కుమార్ (ఎ-4) సామంతుల సుదర్శన్ సహకారంతో తయారు చేసి, వాటిని చూపి, వాహనాలను విక్రయించే వారన్నారు.

కొనుగోలుదారులకు త్వరలోనే తమ పేరు మీద ఆర్టీఎ కార్యాలయంలో వాహనాన్ని ట్రాన్స్ఫర్ చేస్తామని, నమ్మించి, వారి నుండి డబ్బులు తీసుకొని, వాహనాలను విక్రయించేవారన్నారు. వాహనాలను విక్రయించిన తరువాత కొనుగోలు దారులు వాహనాలను తమ పేరున ట్రాన్స్ఫర్ చేయమని ఎన్నిసార్లు కోరినా, వారు కాలయాపన చేస్తూ, ఫోనుకు అందుబాటులో లేకుండా ఉండేవారని డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు తెలిపారు.

నిందితుల వద్ద నుండి వన్ టౌన్ పిఎస్ కేసుల్లో ఎపి 39హెచ్.యు 6763 నంబరు గల పల్సర్ మోటారు సైకిల్, ఎపి 39 జెఎఫ్ 5637 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, గంట్యాడ పిఎస్ కేసులో ఎపి 35ఎఆర్ 4992 గల గ్లామర్ బైక్, విజయనగరం టూటౌన్  పిఎస్ కేసులో చోరీకి గురైన ఎపి 39 4701 గల పల్సర్ మోటారు సైకిల్ ను తిరిగి, స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. అంతేకాకుండా, వివిధ వాహనాలకు చెందిన నకిలీ పివిసి కార్డులు, ఆధార్ కార్డులు, డ్రైవింగు లైసెన్సులను, 5వేలు నగదు, ప్రింటర్, కంప్యూటరు మరియు ఇతర పరికరాలను కూడా స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండుకు తరలించామన్నారు.

ప్రజలకు విజ్ఞప్తి

ప్రజలెవరైనా పాత వాహనాలను కొనుగోలు చేసిన వెంటనే తమ పేరున ఆర్టీఎ కార్యాలయంలో ట్రాన్స్ఫ ర్ చేయించుకున్నట్లయితే, ఇటువంటి నేరాలను నియంత్రించవచ్చునన్నారు. అంతేకాకుండా, వాహనాలు కొనుగోలు చేసిన తరువాత ఎటువంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. కావున, ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి, పాత వాహనాలను కొనుగోలు,విక్రయించిన వెంటనే సంబంధిత వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసినట్లయితే కొనుగోలుదారులు, విక్రయదారులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు తెలిపారు.

విజయనగరం వన్ టౌన్ పరిధిలో పరిధిలో జరిగిన మోటారు సైకిళ్ళు దొంగతనం కేసులను చేధించడంలో కీలక పాత్ర వహించిన వన్ టౌన్ సిఐ డా.బి.వెంకటరావు ఎస్ఐ వి. అశోక్ కుమార్, డి. విజయకుమార్, హెచ్.సి ఎం.అచ్చిరాజు, కానిస్టేబుళ్ళు టి.శ్రీను, పి. శివ శంకర్, ఎస్. అజయ్కుమార్, జి. అనిల్ కుమార్, సిహెచ్. తిరుపతిరావు లను జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించారని విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు తెలిపారు.

Related posts

హిందూపురం జిల్లా కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

అధికారం శాశ్వతం కాదు, ప్రత్యర్థులను వేధించొద్దు

Satyam NEWS

అభివృద్ధి పేరుతో కేంద్ర నిధులు దోచుకుంటున్న కాంట్రాక్టర్

Satyam NEWS

Leave a Comment