32.2 C
Hyderabad
March 29, 2024 00: 46 AM
Slider రంగారెడ్డి

హఫీజ్ పేటలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం

#Crime Scene

హైదరాబాద్ శివారులోని మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగేళ్ళ చిన్నారితో ఒక కామాంధుడు అసభ్యంగా ప్రవర్తించాడు.  

హఫీజ్ పేటలో నివాసముంటున్న ఒక చిన్నారి బాలిక  బజారుకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఓ గుర్తు తెలియని యువకుడు అసభ్య ప్రవర్తనతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

చిన్నారి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు, బాధితుల కథనం ప్రకారం… ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తూ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ మార్తాండ్ నగర్ లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు.

కాగా సోమవారం మధ్యాహ్నం సమయంలో అతని కుమార్తె చాక్లెట్లు తెచ్చుకోవడానికి దుకాణానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఓ గుర్తు తెలియని యువకుడు ఆ చిన్నారిని సమీపంలోని అపార్ట్ మెంట్ లోకి తీసుకువెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు.

కొద్దిసేపటి అనంతరం యువకుడు  అక్కడినుండి వెళ్లిపోగా ఇంటికి వెళ్లిన చిన్నారి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ప్రసాద్ మియాపూర్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు  అపార్టుమెంట్ లోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. 

సదరు యువకుడు బాలికతో చేసిన అసభ్య చేష్టలు కెమెరాల్లో రికార్డు కావడంతో, దృశ్యాల ఆధారంగా నిందితుడికోసం సమీప ప్రాంతాల్లో గాలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

కృత్రిమ గుండె సృష్టి ఎంత వరకూ వచ్చింది?

Satyam NEWS

టీజేఎస్ యూత్ ప్రధాన కార్యదర్శిగా గొంగరెడ్డి వెంకటరెడ్డి

Satyam NEWS

కడప తెలుగు మహిళ పదవికి రాజీనామా

Satyam NEWS

Leave a Comment