31.7 C
Hyderabad
April 25, 2024 02: 36 AM
Slider పశ్చిమగోదావరి

ఫ్రీ వస్తువులు పంచాలంటే పోలీసు పర్మిషన్ తప్పని సరి

Jangareddygudem CI

మాస్కులు, ఆహారం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలంటే తప్పకుండా అందరూ ఏరియా పోలీస్ స్టేషన్ అనుమతి తీసుకోవాలని జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.ఎన్ నాయక్ తెలిపారు. చాలామంది సరైన ప్రమాణాలు లేని మాస్కులు కుట్టించి పంపిణీ చేస్తున్నారని, వాటి వలన ఎటువంటి ఉపయోగం ఉండదని ఆయన అన్నారు.

నిపుణులతో పరీక్ష చేసిన తర్వాతే మాస్కులు పంపిణీ కి అనుమతి ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఆహారం వండించి, మజ్జిగ పోట్లలు తయారు చేసే పంచుతున్నారని, సరైన ప్రమాణాలు పాటించకుండా ఆహార పానీయాలు పంచితే ప్రజలకు హాని జరగవచ్చు కాబట్టి పోలీసుల అనుమతిలేనిదే ఎటువంటి ఆహార పానీయాలు పంచ రాదని సిఐ తెలిపారు.

స్వచ్ఛంద సేవ చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒకరిని గౌరవిస్తాం కానీ సరైన ప్రమాణాలు లేకుండా ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. అదే విధంగా ఇక నుంచి శాని టైజర్లు పంపిణీ చేయాలన్నా పోలీసు వారి అనుమతి తప్పనిసరి అని తమ హెచ్చరిక పాటించని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

Related posts

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై టిఆర్ఎస్ పార్టీ మహా ధర్నా

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వ‌ర్యంలో డీసీఆర్బీ ఒక్క‌ రోజు నివేదిక….!

Satyam NEWS

రమేష్ కుమార్ కేసులో కౌంటర్ దాఖలు చేయని ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment