ఉచిత వైద్య ఆరోగ్య, కంటి చికిత్స శిబిరం ఏర్పాటు చేసేందుకు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ విభాగం నిర్ణయించింది. ఈ నెల 21న ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని జాతీయ సేవా పథకం (NSS)జిల్లా సమన్వయకర్త ఏ ఉదయశంకర్ తెలిపారు. ఈ నెల 21న శనివారం ఉదయం 10.00 గం నుండి విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ కళాశాల ప్రాంగణంలో ఈ మెగా రక్తదాన శిబిరం, ఉచిత కంటి, వైద్య ఆరోగ్య శిబిరము ప్రారంభం కాబోతోందని అవసరమైన వారు శిబిరానికి రావచ్చునని ఆయన తెలిపారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్.సుదర్శన రావు ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం పరిధిలో ఉన్న ప్రతి NSS యూనిట్ నుంచి NSS వాలంటీర్లు కచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా జాతీయ సేవా పథకం (NSS)జిల్లా సమన్వయకర్త ఉదయశంకర్ కోరారు.
previous post