అడాప్ట్ ఏ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో కొండూరు శరత్ కుమార్ రాజు ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ లో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో భాగంగా గత కొన్ని రోజులుగా కంటి ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఈ మధ్య 9 మందికి ఆపరేషన్స్ జరగగా ఇవాళ మరో 11 మందికి ఉచిత కంటి ఆపరేషన్ కొరకు తిరుపతి వాసన్ కంటి ఆసుపత్రికి శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ వాన్ లో చైర్మన్ కొండూరు శరత్ కుమార్ అధ్వర్యంలో పంపించడం జరిగింది. ఆ 11 మందితో పాటు గత వారం ఆపరేషన్స్ చేసిన వారికీ చెకప్ కోసం పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండూరు శరత్ కుమార్ రాజు,కన్వీనర్ అంజన రాజు, శివ రామ రాజు పాల్గొన్నారు.
previous post
next post