37.2 C
Hyderabad
March 28, 2024 17: 52 PM
Slider మహబూబ్ నగర్

నల్లమల ఆదివాసీలకు పీయూ ఆధ్వర్యంలో ఉచితం వైద్య శిబిరం

#palamuru university

నల్లమల ఆదివాసీల కోసం పీయూ ఆధ్వర్యంలో ఉచితం వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ పాలమూరు యూనివర్సిటీ ప్రొపెసర్ ఎల్.బి లక్ష్మీకాంత్ రాథోడ్ తెలిపారు.

నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని బౌరాపూర్, అప్పపూర్ గ్రామలతో పాటు పరిసర నల్లమల చెంచుపెంటలలో నివాసం ఉంటున్న  ఆదివాసీలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చునని ఆయన తెలిపారు.

రాష్ట్ర గవర్నర్ తమిలీ సై సౌందర్య రాజన్ ఆదేశాల మేరకు పాలమూరు యూనివర్సిటీ  ఆధ్వర్యంలో  నల్లమల ఆదివాసీల ఆరోగ్య పరిరక్షణకై హెల్త్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.

వైద్య నిపుణులు, ప్రత్యేక వైద్య బృందం ఈ వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

ఈ హెల్త్ క్యాంపు ప్రారంభోత్సవనికి  నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ తో పాటు, తెలంగాణ ప్రభుత్వ విప్, అచ్చంపేట MLA గువ్వల బాల్ రాజ్, ఆదివాసీల పరిశోధకురాలు ప్రొఫెసర్ గూడూరు మనోజ, నాగర్ కర్నూల్ DM&HO సుధాకర్ లాల్, మహబూబ్ నగర్ హెల్త్ సూపర్ డెంట్ డాక్టర్ రామ్ కిషన్ పాల్గొంటారు.

Related posts

కొల్లాపూర్ లో నేడు కేటీఆర్ సభకు మాజీ మంత్రి జూపల్లి వస్తారా?

Satyam NEWS

పీస్ ఫుల్: ప్రశాంతంగా ముగిసిన పుర ఎన్నికలు

Satyam NEWS

విస్తృతంగా రాజంపేట లో బత్యాల ప్రజా చైతన్య యాత్ర

Satyam NEWS

Leave a Comment