37.2 C
Hyderabad
April 19, 2024 14: 27 PM
Slider ప్రత్యేకం

ఎలాంటి ఆసరాలేని వారికి ఉచితంగా న్యాయ సహాయం

#legalaid

న్యాయం దృష్టిలో అందరూ సమానులేనని, న్యాయానికి గొప్పా, బీదా అన్న తేడా లేదని జోగులాంబ గద్వాల జిల్లా మూడవ అదనపు  జిల్లా జడ్డి శివ కుమార్ అన్నారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా నేడు థరూర్ మండలం గోర్నాల గ్రామంలో  లీగల్ సర్వీసు ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఫోస్కో జిల్లా జడ్జి సంతోష్ కుమార్, జూనియర్ సివిల్ జడ్జి గాయత్రీ న్యాయవాదులు పూజరి శ్రీధర్, వరలక్మి, నాగరాజు, శ్రీనిత, లక్ష్మన్న, శ్రీలేఖ, లకు లో పాల్గొన్నారు.

జిల్లా న్యాయమూర్తి శివకుమార్ మాట్లాడుతూ అందరికీ సమానావకాశాలు కల్పించడానికి ఉచిత న్యాయ సహాయం అందించాలని కోరారు. ముఖ్యంగా ఏ పౌరుడూ ఆర్థిక కారణాల మూలంగా గాని, మరే ఇతర బలహీనతల మూలంగా గానీ న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండడం కోసం ఉచిత న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం భావించిందని ఆయన తెలిపారు. బీద,బలహీన వర్గాల వారికి న్యాయ విధానం అందుబాటులోకి తేవడం కోసం, వారికి సామాజిక, ఆర్థిక న్యాయాలు కల్పించడం కోసం ఉచితం న్యాయ సహాయాన్ని అందించాలని నిశ్చయించామని తెలిపారు.

1976లో భారత రాజ్యాంగానికి అధికరణ 39ఏ జతచేసి బీద, బలహీనవర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా నిర్దేశించారని ఆయన తెలిపారు. ఈ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ కులం, తెగకు చెందినవారు, మానవ అక్రమ రవాణా బాధితులు, ఏ ఆధారం లేనివారు, స్త్రీలు, పిల్లలు, మతి స్థిమితం లేనివారు, అవిటివారు, సామూహిక విపత్తు, హింసాకాండ, కుల వైషమ్యాలు, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, పారిశ్రామిక విపత్తులు వంటి విపత్తులలో చిక్కుకున్నవారు, పారిశ్రామిక కార్మికులు ఉచితంగా న్యాయ సహాయం పొందడానికి అర్హులని ఆయన తెలిపారు.

ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) చట్టము 1956లో సెక్షన్ 2 (జి)లో తెలిపిన “నిర్బంధము”, లేక బాల నేరస్థుల న్యాయ చట్టము 1986 సెక్షన్ 2 (జె)లో తెలిపిన నిర్బంధము లేక మెంటల్ హెల్త్ చట్టము 1987 సెక్షన్ (జి)లో తెలిపిన మానసిక వైద్యశాల లేక మానసిక చికిత్సాలయములో తెలిపిన “నిర్బంధము”లోఉన్న వ్యక్తులు కూడా న్యాయ సహాయం పొందడానికి అర్హులు. అదే విధంగా వార్షిక ఆదాయం రూ.1,00,000 (రూ. లక్ష)కు మించని వ్యక్తులు కూడా ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హత కలిగి ఉన్నారు. అర్హత గల వాది, ప్రతివాదులు కూడా న్యాయ సహాయం పొందవచ్చునని ఆయన తెలిపారు.

ఉచిత న్యాయం కోసం దరఖాస్తు చేయు పద్ధతి

న్యాయ సహాయం కోరువారు తమ కేసు పూర్వాపరాలు, కావలసిన పరిష్కారము (రిలీఫ్)ను వివరిస్తూ అఫిడవిట్ ను, సంబంధిత డాక్యుమెంట్లను జతచేస్తూ దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తుదారులు పైన తెలిపిన అర్హతలలో ఏవి కలిగి ఉన్నదీ తెలియపరుస్తూ తగిన ఆధారాలను (వీలైనంత మేరకు) పంపితే నిబంధనల మేరకు తగు చర్య తీసుకుంటారు.

దరఖాస్తు చేయవలసిన చిరునామా

ఉచిత న్యాయ సహాయము కోరువారు తమ తమ జిల్లాలకు చెందిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థలకు గాని,రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు గాని తమ కేసుల వివరములను తెలుపుతూ దరఖాస్తు చేసుకొనవచ్చును. జిల్లా స్థాయిలో అయితే కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంబంధిత జిల్లా కోర్టు భవనములు లేదా రాష్ట్ర స్థాయిలో అయితే సభ్య కార్యదర్శి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ న్యాయ సేవాసదన్,సిటీసివిల్ కోర్టు భవనములు,పురానీహవేలి హైదరాబాద్ -500 002 లేదా కార్యదర్శి, హైకోర్టు న్యాయ సేవాధికార సంఘం, హైకోర్టు భవనములు, హైదరాబాద్ – 500066.

న్యాయ సహాయ విధానాలు

న్యాయవాదిచే ఉచితముగా న్యాయ సలహా ఇప్పించుట.

కేసులను పరిశీలించిన మీదట అవసరమైనచో దరఖాస్తుదారుని తరపున న్యాయవాదులను నియమించి ఆయా కోర్టులలో కేసులు చేపట్టుట.

న్యాయ సహాయం పొందినవారికి కోర్టు ఫీజు, కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చులు భరించుట.

న్యాయ సహాయం పొందినవారికి ఆయా కేసుల్లో జడ్జిమెంట్ల నకళ్ళు ఉచితముగా ఇచ్చుట, మొదలగు సహాయములు అందించబడతాయి.

(ఈరోజు జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా..)

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

మళ్లీ పెరగనున్న వంటనూనెల ధరలు

Murali Krishna

అమర వీరుల దినోత్సవం సందర్భంగా విజయనగరం లో కొవ్వొత్తుల ర్యాలీ

Satyam NEWS

7 న సరూర్ నగర్ స్టేడియంలో మ్యూజిక్ హంగామా

Satyam NEWS

Leave a Comment