31.2 C
Hyderabad
April 19, 2024 05: 52 AM
Slider హైదరాబాద్

జర్నలిస్టుల ఉచిత ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన

#pressclub

ప్రెస్ క్లబ్ కమిటీ,జీ వాశ్రీ ఆయుర్వేదిక్ వెల్ నైస్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయుర్వేదిక్ మెగా హెల్త్ క్యాంపు కు విశేష స్పందన లభించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆవరణలొ  నిర్వహించిన శిబిరాన్ని తెలంగాణ స్టేట్ టెక్నాలోజీ సర్వీసెస్ చైర్మన్ పెటిమీది జగన్ మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జర్నలిస్టుల వృత్తి కత్తి మీది సాము లాంటిదని అనునిత్యం విధుల్లో ఒత్తిడి కి లోనవుతారన్నారు. జర్నలిస్టులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. 

జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణ కోసం ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల  ప్రెస్ క్లబ్ అకాడమీ సభ్యులను, వెల్ నైస్ సెంటర్ డాక్టర్లను అభినందించారు. దాదాపు 300 మంది జర్నలిస్టులకు అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా  వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నెల రోజులకు సరిపడా ఉచిత మందులను పంపిణీ చేశారు.

కొందరికి సహజ సిద్ధమైన వైద్యం తొ పాటు లైఫ్ స్టైల్స్ అలవాట్లు,స్ట్రెస్ మేనేజ్మెంట్ పై అవగాహన కల్పించారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడ వైద్యపరీక్షలుచేయించుకున్నారు. ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన వ్యాధులపై నిపుణులైన డాక్టర్లచే పరీక్షలు నిర్వహించడం విశేషం. వెల్ నెస్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్  ఫణి శ్రీ కొంటె ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్  అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు,కార్యదర్శి రవి కాంత్ రెడ్డి, ట్రెజరర్  రాజేష్,ఉప కార్యదర్శి హరి ప్రసాద్, సభ్యులు బాబురావు,పద్మా దేవి,రమాదేవి,ఉమాదేవి, వసంత,శ్రీనివాస్  పర్యవేక్షించి విజయవంతం చేశారు.

Related posts

ఆదర్శం: విద్యార్ధుల్ని దత్తత తీసుకున్న తెలుగుదేశం నేతలు

Satyam NEWS

ముద్దులొలికే చిన్నారితో సహా దంపతుల అనుమానాస్పద మృతి

Satyam NEWS

నీతి, నిజాయితీ, సేవా స్ఫూర్తితో ప్రజలకు సేవలందించాలి

Satyam NEWS

Leave a Comment