27.7 C
Hyderabad
April 25, 2024 10: 12 AM
Slider ఖమ్మం

బస్తీ దవాఖానాల ద్వారా ఉచిత వైద్య సేవలు

#hospital

బస్తీ దవాఖానాల ద్వారా పట్టణ పేదలకు ఇంటి చెంతనే ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఖమ్మం వైఎస్సార్ నగర్ లోని బస్తీ దవాఖానాను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి రోజుకు ఎంతమంది పేషంట్లు వస్తున్నది, ఎక్కువగా ఏ ఏ వ్యాధుల వారు వస్తున్నది అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్ల పరిశీలన చేశారు. రోజుకు 40 నుండి 45 మంది పేషంట్లు వస్తున్నట్లు, డ్రెస్సింగ్ కొరకు ఎక్కువ మంది వస్తున్నట్లు వైద్యాధికారి కలెక్టర్ కు వివరించారు. సహాయక సిబ్బందిని కేటాయింపుకు కోరారు. ప్రతి మంగళవారం డయాబెటిక్ డే నిర్వహిస్తున్నట్లు, ప్రతి గురువారం ఏఎన్సి కేసులు చూస్తున్నట్లు, ఏఎన్సి రిజిస్టర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోగులకు మొదటి అంతస్థులో వెళ్లుటకు ఇబ్బందులు పడుతున్నట్లు, గ్రౌండ్ ఫ్లోర్ లో మార్చుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ తనిఖీలో  డిఆర్వో శిరీష, వైద్యాధికారి డా. మౌర్య, స్టాఫ్ నర్స్ చైతన్య తదితరులు ఉన్నారు.

Related posts

అధికారం శాశ్వతం కాదని జగన్ గుర్తుంచుకోవడం మంచిది

Satyam NEWS

స‌త్యం వారి ఆచ‌ర‌ణ‌, శాంతి వారి సందేశం,ప్రేమ వారి స్వ‌రూపం….!

Satyam NEWS

కొల్లాపూర్ కోటలో ప్లాట్లు కొంటే ఆగమౌతారు జాగ్రత్త

Satyam NEWS

Leave a Comment