28.7 C
Hyderabad
April 20, 2024 10: 33 AM
Slider ప్రపంచం

ఆస్ట్రేలియాలో అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

#ScottMorrision

దేశంలోని వారందరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు. ఇందుకోసం ఆస్ట్రాజెనికా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన వెల్లడించారు. ఆస్ట్రాజెనికా కంపెనీ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి వ్యాక్సిన్ ను రూపొందించే పనిలో ఉంది.

‘‘ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తయారీ అడ్వాన్స్ డ్ స్టేజ్ లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా తయారు చేస్తున్న వ్యాక్సిన్ల అన్నింటిలో దీని ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఒకవేళ ఈ వ్యాక్సిన్ సక్సెస్ అయితే, మా దేశంలోనే తయారు చేసి ప్రజలందరికీ ఫ్రీగా అందజేస్తాం” అని మోరిసన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆయన బుధవారం సిడ్నీలోని ఆస్ట్రాజెనికా లేబోరేటరీని సందర్శించారు. ‘‘ఇదే వ్యాక్సిన్ లేదా మరేదైనా సక్సెస్ అవుతుందా? అనే గ్యారంటీ లేదు. అందుకే వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలతో చర్చలు జరుపుతున్నాం” అని మోరిసన్ చెప్పారు. ఈ డీల్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.

ఫైనల్ అగ్రిమెంట్ అయిన తర్వాతనే వ్యాక్సిన్ ధర, డిస్ట్రిబ్యూషన్ పై క్లారిటీ వస్తుంది. థర్డ్ ఫేజ్లో వ్యాక్సిన్ ట్రయల్స్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ట్రయల్స్ మూడో దశలో ఉన్నాయి. సెప్టెంబర్ లోనే వ్యాక్సిన్ తయారీ ప్రారంభం అవుతుంది. వ్యాక్సిన్‌‌‌‌ 300 కోట్ల డోసులకు కోసం వివిధ దేశాలతో ఆస్ట్రాజెనికా ఇప్పటికే డీల్‌‌‌‌ కుదుర్చుకున్నది.

Related posts

బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి

Satyam NEWS

ప్రత్యేక విమానాలు లేక శ్రీనగర్‌ కిటకిట

Satyam NEWS

పంట నీరు వృధా అవుతున్నా పట్టించుకోవడం లేదు

Satyam NEWS

Leave a Comment