27.7 C
Hyderabad
April 24, 2024 09: 34 AM
Slider హైదరాబాద్

అటు రైతుకు ఇటు పేదవాడికి సాయం చేసిన కిషన్ రెడ్డి

vegitables 101

చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి 22 టన్నుల కూరగాయలు హైదరాబాద్ కు తెప్పించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఉచితంగా సికింద్రాబాద్ పార్లమెంట్ లో పంపిణీ చేశారు. మొత్తం 10 రకాల పంపిణీ చేయించారు.

హైదరాబాద్ నగరంలో ఇప్పటికే అవసరమైన పేదవారికి నిత్యావసర వస్తువులు ఉచితంగా అందిస్తూనే, కూరగాయలకు ఇబ్బందిపడుతున్న ప్రజలను చూసి కిషన్ రెడ్డి ఇరవై రెండు టన్నుల కూరగాయలను డైరెక్టుగా రైతుల దగ్గర కొనుగోలు చేసి నగరంలోని పేదలకు ఉచితంగా పంపిణీ చేశారు.

పలమనేరు నుంచి ఒక ప్రత్యేక ట్రక్ లో కూరగాయలు తెప్పించిన కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ లోని 38 డివిజన్లకు వెళ్లే విధంగా ప్యాకింగ్ చేయించారు. ఆటోల్లో తరలించి ఆయా డివిజన్ లలో పంపిణీ చేశారు. పండించిన  రైతుకు లాభం ఉండాలనే రైతుల దగ్గర నేరుగా కొని, అలానే నగరంలో పేదవారికి ఉచితంగా కూరగాయలు పంపిణీ చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.

బర్కత్ పురా లోని నగర బిజెపి కార్యాలయంలో  కూరగాయల స్టాకు ఏర్పాటుచేసి అక్కడి నుంచే ప్యాకింగ్ లతో ఆయా నియోజకవర్గాలకు పంపిణీ చేస్తున్నారు. నగర బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేయడం అక్కడి నుంచి పంపిణీ చేస్తున్నారు.

ఈ అంశాలను బీజేపీ సీనియర్ నేతలు ప్రకాష్ రెడ్డి, ఛాయా దేవి, రామన్న గౌడ్ ,అమృత పలువురు చూస్తున్నారు. పేద ప్రజలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేయడంతో పాటు, రైతులకు న్యాయం జరిగేలా కిషన్ రెడ్డి తీసుకుంటున్నా చొరవ అభినందనీయమని , మార్గదర్శకమని పలువురు అభిప్రాయపడ్డారు.

Related posts

ఉక్రెయిన్ రష్యా మధ్య చర్చలు విఫలం: యుద్ధం కొనసాగింపు

Satyam NEWS

పూజా కార్యక్రమాలతో సహస్ర ఎంటటైన్మెంట్స్ చిత్రం ప్రారంభం

Bhavani

రీస‌ర్వే తో భూముల‌కు శాశ్వ‌త హ‌క్కు

Satyam NEWS

Leave a Comment