32.7 C
Hyderabad
March 29, 2024 12: 12 PM
Slider జాతీయం

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని దుర్వినియోగం చేస్తున్నారు

#ChiefJusticeofIndia

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ (ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ) అనేది ఈ మధ్య కాలంలో అతి ఎక్కువగా దుర్వినియోగం అయిన ప్రాధమిక హక్కు అని భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డే వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీలో ఈ ఏడాది ప్రధమార్ధంలో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశం నేపథ్యంలో కరోనా వైరస్ విజృంభించిందనే అంశంపై మీడియాలో మత సామరస్యానికి భంగం కలిగించే పలు అంశాలు ప్రచారమైనాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సీనియర్ న్యాయవాది దుష్యంత దవే చేసిన వ్యాఖ్యలు విన్న అనంతరం చీఫ్ జస్టిస్ ఈ కామెంట్ చేశారు.

మీరు ఏ విధంగానైతే స్వేచ్ఛగా వాదిస్తున్నారో వారు కూడా అదే విధంగా వారు అనుకున్నది చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత కాలంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అతి ఎక్కువగా దుర్వినియోగం అయిన అంశం అని ఆయన వ్యాఖ్యానించారు.

తప్పుడు వార్తలు ప్రచారం చేసినట్లు వెల్లడి అయినా కూడా సంబంధిత ప్రభుత్వం శాఖ ఎలాంటి చర్యలు తీసుకున్నదో స్పష్టంగా వెల్లడించకపోవడంపై కూడా ప్రధాన న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక జూనియర్ కార్యదర్శితో అఫిడవిట్ దాఖలు చేయించడం, పిటిషన్ లో ఎవరూ స్పష్టమైన సంఘటనలు పేర్కొనలేదని చెప్పడం తప్పించుకునే విధానాలేనని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

సీనియర్ కార్యదర్శి నుంచి అఫిడవిట్ దాఖలు చేసి ఉంటే బాగుండేదని తనకు కొంచెం సమయం ఇస్తే సీనియర్ కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేసే విధంగా చూస్తానని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు. కేసును రెండు వారాలు వాయిదా వేశారు.

Related posts

జనచైతన్య ట్రస్ట్ అధ్వర్యంలో రక్తదానం

Satyam NEWS

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాష్టీకంపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు

Satyam NEWS

ఎన్నికల సందర్భం…ఏపీలో భారీ గా ఏఎస్పీల బదిలీలు…!

Satyam NEWS

Leave a Comment