30.7 C
Hyderabad
April 17, 2024 00: 46 AM
Slider ఆంధ్రప్రదేశ్

త‌గ్గ‌నున్ననివ‌ర్ ప్ర‌భావం

Toofan

తీవ్రవాయుగుండంగా కొనసాగుతున్ననివర్ తుపాను కొన‌సాగుతోంద‌ని ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ ప్ర‌జ‌ల‌కు సూచించింది. రాగల ఆరు గంటల్లో నివ‌ర్ తుపాను వాయుగుండంగా ఆ తదుపరి అల్పపీడనంగా బలహీన పడనుంద‌ని వెల్ల‌డించింది. తిరుపతికి పశ్చిమ నైరుతిగా 30 కీమీ దూరంలో, చెన్నైకి పశ్చిమ వాయువ్య దిశగా 115 కిలోమీటర్ల దూరంలో నివర్ ఉందంది. దీని ప్ర‌భావంతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల వ్యాప్తంగా గంటకు 55-75 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి , కృష్ణా , గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయ‌ని శుక్ర‌వారానికి నివ‌ర్ ప్ర‌భావం త‌గ్గుతుని తెలిపింది.

కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నివ‌ర్ ప్ర‌భావంతో శ‌నివారం కూడా విస్తృతంగా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంద‌ని, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయ‌ని, వర్షాల నేపధ్యంలో వాగులు, వంకలు పొంగిపోర్లే అవకాశం ఉంద‌ని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌ని, రైతులు పంట సంరక్షణకై తగిన జాగ్రత్తలు తీసుకోవాల‌ని విప‌త్తుల శాఖ క‌మిష‌న‌ర్ కె. క‌న్న‌బాబు ప్ర‌జ‌ల‌కు సూచించారు.

Related posts

సేవ్ సునీత: కామాంధుడైన ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి

Satyam NEWS

ఆర్టీసీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

పండగ వాతావరణంలో ప్రారంభమైన పాఠశాలలు

Satyam NEWS

Leave a Comment