మూఢ నమ్మకమో, చేసిన ప్రతిసారి ఫలితం రావడంతో కలిగే విశ్వాసమో తెలియదు కానీ వర్షాలు కురవక పోతే కప్పల పెళ్లిళ్లు చేయడం పల్లెల్లో ఇప్పటికీ వస్తున్న ఆనవాయితీ. వర్షాలు కురవాలని కప్ప తల్లి ఆట ఆడటం కూడా చాలా చోట్ల కనిపిస్తూనే ఉంటుంది. కప్పలకు పెళ్లిళ్లు చేయడం చాలాచోట్ల చూస్తూనే ఉంటాం. అలాగే వర్షాలు కురవాలని కప్పతల్లి ఆడి పెళ్లి చేశాకా విపరీతమైన వర్షాలు పడుతుంటే ఏం చేస్తారు ..వాటిని ఆపడమెలా..? మధ్యప్రదేశ్ ప్రజలు దీనికో కొత్త ఉపాయం కనిపెట్టారు.వర్షాలు కురవాలని పెళ్లి చేసిన కప్పలకు వేద మంత్రోచ్ఛరణల నడుమ విడాకులు ఇప్పించేశారు. ఓం శివశక్తి మండల్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ విడాకుల తంతు జరిపించారు. కప్పలకు విడాకులు ఇప్పించడం ద్వారా భారీ వర్షాలు ఆగిపోతాయని వారు నమ్ముతున్నారు. గడిచిన 24 గంటల్లో మధ్యప్రదేశ్‌లో 48మి.మీ వర్షం కురిసింది. బోపాల్ కలియసోత్ డ్యామ్, భదాడ డ్యామ్ లు నిండిపోవడంతో వాటి గేట్లను తెరిచారు. కోలార్ డ్యామ్ గేట్లను కూడా తెరిచి నీటిని కిందకు వదిలారు. ఇప్పుడు విడాకులు ఇప్పించిన కప్పలకు.. వర్షాలు కురవాలని కోరుతూ జులై 19న పెళ్లి జరిపించారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో 26శాతం అధిక వర్షపాతం నమోదైంది. వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలాచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భోపాల్ పట్టణంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది.ఈ నేపథ్యంలో అతివృష్టిని నియంత్రించేందుకు కప్పలకు విడాకులు ఇప్పించారు.
previous post
next post