అమెరికా పర్యటన పూర్తి చేసుకుని ఎపి సియం జగన్ మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం కు చేరుకున్నారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 15న అధికారిక, వ్యక్తిగత పర్యటన నిమిత్తం సిఎం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అమెరికా లో పలువురు పారిశ్రామికవేత్తలు,ప్రవాస తెలుగువారితో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. అమెరికా పర్యటన ముగించుకుని ఈ తెల్లవారుజామున 3 గంటలకు సియం జగన్, ఆయన సతీమణి భారతి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని తెల్లవారుజామున 4.30 గంటలకు తాడేపల్లి నివాసానికి వచ్చారు.
previous post
next post