పల్నాడులో నేటి నుంచి వీరుల ఆరాధనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పల్నాటి పౌరుషం, ప్రాభవానికి గుర్తుగా ఏటా ఐదు రోజులపాటు వీటిని నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతాయి. క్రీడాజ్యోతితో నిర్వహించే ర్యాలీతో ప్రారంభమయ్యే వేడుకల్లో 27న చాపకూడు భోజనం, 28న కోడిపోరు కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఆచారవంతులు తరలివచ్చి కొణతాలుగా పిల్చుకునే ఆనాటి ఆయుధాలకు పూజలు నిర్వహిస్తారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం ఈ ఏడాది 10 లక్షల రూపాయలు మంజూరు చేసింది.
previous post