30.7 C
Hyderabad
April 24, 2024 02: 24 AM
Slider నల్గొండ

రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా పండ్లు పంపిణీ

#hujurnagar congress

మాజీ AICC అధ్యక్షుడు,పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ  51వ, జన్మ దినోత్సవ సందర్భంగా హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో  పేషెంట్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పండ్లు పంపిణీ  చేశారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు మాట్లాడుతూ దేశ ప్రజల కొరకు నాయనమ్మ తూటాలతో బలైనా,తండ్రి  బాంబుల దాడిలో మరణించినా ఎక్కడా కుంగిపోకుండా దేశం కోసం పని చేసిన వ్యక్తి అని రాహుల్ గాంధీని కొనియాడారు.

జన్మతః  కోటీశ్వరుడైన, హంగు ఆర్భాటాలకు తావివ్వకుండా నీతిగా,నిజాయితీగా మాట్లాడుతూ   మచ్చలేని నాయకుడిగా దేశ చరిత్రలోనే ఎనిమిది లక్షల పైగా ఓట్లతో  అత్యధిక మెజార్టీతో పార్లమెంటు సభ్యుడిగా గెలిచి  చరిత్ర సృష్టించిన వ్యక్తి అని అన్నారు.

ప్రభుత్వ వైఫల్యం వల్ల దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తు ప్రజలకు సరైన  వైద్య సాయం,టీకాలు అందక ఇబ్బందులకు గురి అవుతుంటే  దేశ ప్రజల తరుపున ప్రభుత్వంతో అనునిత్యం పోరాటం  చేస్తున్న వ్యక్తి, భారతావనికి కాబోయే భారత ప్రధాని రాహుల్ గాంధీ అని అన్నారు.రాహుల్ గాంధీ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ఐ.డీ.సీ సభ్యులు సాముల శివారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రెటరీ MD అజిజ్ పాషా, రాష్ట్ర ఐ.టీ సెల్ ఉపాధ్యక్షుడు శివరామ యాదవ్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, కౌన్సిలర్ తేజావత్ రాజా నాయక్, వెలిదండ సరితా వీరారెడ్డి, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోల్లపూడి యోహాన్,

INTUC నాయకులు ఇంటి అచ్చమ్మ, మేళ్ళచెరువు ముక్కంటి, పాశం రామరాజు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇట్టి మల్ల బెంజిమెన్, దొంతగాని జగన్,యడవల్లి వీరబాబు, జింజిరాల సైదులు,అంజనపల్లి సుదర్శన్, అజ్జు,సంక్రాంతి కోటేశ్వరరావు,దాసరి రాములు,జయరాజు,రామారావు,ఖాజా మియా,వీరబాబు.తదితరులు పాల్గొన్నారు.

Related posts

బూతుల మంత్రితో పోటీపడుతున్న కొబ్బరి చిప్పల మంత్రి

Satyam NEWS

ప్రేమ… పెళ్లి… చోరీ… కేసు: ట్విస్టుల మధ్య లవర్స్

Satyam NEWS

స్ట్రగుల్: ఎన్ఆర్సీ ఉద్యమానికి మరింత మద్దతు

Satyam NEWS

Leave a Comment