28.2 C
Hyderabad
April 20, 2024 11: 54 AM
Slider ఆధ్యాత్మికం ఆంధ్రప్రదేశ్

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత

Tirumala-Brahmotsavams

ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలలో అతి ముఖ్యమైన శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాదీ రంగరంగ వైభవంగా జరుగుతాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మొత్తం 16 వాహనాలపై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తకోటికి దర్శనమిస్తాడు. ఈ ఉత్సవశోభను తిలకించేందుకు దేశం నలుమూలలతోపాటు విదేశాల నుండి కూడా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు.

బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులు ప్రశాంత వాతావరణంలో శ్రీవారి మూలమూర్తితోపాటు వాహనసేవలను దర్శించుకునేందుకు వీలుగా టిటిడి యంత్రాంగం రెండు నెలల ముందు నుండే విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. ఏడాదికేడాది భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో అందుకు తగ్గట్టు టిటిడి సౌకర్యాలను మెరుగుపరుస్తోంది. ప్రతి సామాన్య భక్తునికీ సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు టిటిడి నిఘా, భద్రతా విభాగం పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.

బ్రహ్మోత్సవాల్లో మొత్తం 1600కు పైగా సిసి కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం 585 సిసి కెమెరాలు ఉండగా, అదనంగా 1051 కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాలైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ -1, 2, లోపలి, వెలుపలి కార్డన్‌, నాలుగు మాడ వీధులు తదితర ప్రాంతాల్లో ఈ సిసి కెమెరాల నిఘా ఉంటుంది. భక్తులకు రక్షణ కల్పించేందుకు టిటిడి నిఘా సిబ్బందితో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ప్రత్యేకంగా గరుడసేవతోపాటు బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజుల్లో వీరు వివిధ ప్రాంతాల్లో మఫ్టీలో విధుల్లో ఉంటారు.

విజిలెన్స్‌, ఎస్టేట్‌, రెవెన్యూ అధికారులతో కూడిన ప్రత్యేక స్క్వాడ్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో అధిక ధరలను అరికడతారు. తిరుమల, తిరుపతి మధ్య ప్రయివేటు ట్యాక్సీల్లో ప్రయాణించే భక్తులకు రవాణా ఛార్జీలను స్థిరీకరించారు. ఒక్కొక్కరికి రూ.70/-గా ఛార్జీ నిర్ణయించారు. ఆగస్టు 4న ప్రయివేటు ట్యాక్సీ యజమానులు, డ్రైవర్లతో సమావేశం నిర్వహించి అధిక ఛార్జీలు వసూలు, మోతాదుకు మించి ప్రయాణికులను ఎక్కించడం, అధిక వేగం తదితర విషయాలపై స్పష్టమైన సూచనలిచ్చారు.

నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 4న జరుగనున్న గరుడసేవ నాడు 1000 మందితో నాలుగు మాడ వీధుల్లో టిటిడి భద్రతా చర్యలు చేపట్టనుంది. వీరిలో 350 మంది నిఘా, భద్రతా సిబ్బంది, 150 మంది హోంగార్డులు, 200 మంది శ్రీవారి సేవకులు, 200 మంది స్కౌట్లు, 100 మంది ఎన్‌సిసి క్యాడెట్లు ఉన్నారు. సెక్యూరిటీ యంత్రాంగాన్ని సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ నుండి పర్యవేక్షిస్తారు. విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆధీనంలో మొత్తం 15 సిబ్బంది మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు ఇక్కడ విధుల్లో ఉంటారు.

Related posts

బ్రుటల్:పెళ్ళైపిల్లలు ఉన్నాయువతిఫై పెట్రోల్ పోసి నిప్పు

Satyam NEWS

ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధీ

Bhavani

పోస్టాఫీసు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Bhavani

Leave a Comment