36.2 C
Hyderabad
April 25, 2024 21: 06 PM
Slider మహబూబ్ నగర్

బడ్జెట్ లో విద్యా రంగ కేటాయింపు నిరాశాజనకం

Rohith

రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ సమావేశాలలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో విద్య రంగానికి కేటాయించిన నిధులు నిరాశాజనకంగా ఉన్నయని TRTU మాజీ రాష్ట్ర కార్యదర్శి రోహిత్ నాయక్ అన్నారు. 2014-2015 నుండి వరసగా విద్యారంగానికి నిధులు తగ్గిస్తున్నారని, 2014-5015 లో బడ్జెట్ లో 10.08 శాతం నిధులు కేటాయించగా గత సంవత్సరం 6.76 శాతం 2020-2021 సంవత్సరం ఇంకా తగ్గిస్తూ కేవలం 6.69 శాతం నిధులు మాత్రమే కేటాయింపు చేసారని తెలిపారు. ప్రతి ఏడాది నిధులు తగ్గిస్తే విద్యారంగం అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో అక్షరాస్యత పెంచడానికి ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమం ఎలా విజయవంతం అవుతుందన్నారు. ప్రభుత్వం పునరాలోచించి విద్యా రంగానికి బడ్జెట్ కేటాయింపులు  పెంచాలని రోహిత్ నాయక్ డిమాండ్ చేశారు.

Related posts

పరిసరాలు పరిశుభ్రం చేసుకునే డ్రైడే నేడు

Satyam NEWS

కృష్ణానదీ ప్రాంతాలలో కూడా పటిష్టంగా లాక్ డౌన్

Satyam NEWS

నోటీసులు ఇవ్వ‌కుండా గుడిసెలు కూల్చివేయ‌డం అమానుషం

Satyam NEWS

Leave a Comment