30.2 C
Hyderabad
October 14, 2024 19: 40 PM
Slider చిత్తూరు

శ్రీ తాతయ్యగుంట గంగమ్మతల్లి హుండీ కే కన్నం

#Naveen Kumar Reddy

శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో “పని తక్కువ సిబ్బంది సంఖ్య ఎక్కువ” అన్న చందంగా సుమారు 32 మంది సిబ్బందిని పెట్టుకొని ఇష్టారాజ్యంగా అమ్మవారి సొమ్మును జీతాల రూపంలో మంచినీళ్లలా ఖర్చు చేసే హక్కు అధికారం ఎవరిచ్చారని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న రెగ్యులర్,కాంట్రాక్టు ఉద్యోగస్తులు ఎంతమంది? రెగ్యులర్ ఉద్యోగస్తుల కన్నా కాంట్రాక్టు ఉద్యోగస్తులకు జీతాలు ఎలా పెంచారు? ఎవరి అనుమతి తీసుకొని పెంచారు! ఎంత పెంచారు? బహిర్గతం చేయాలన్నారు.

గంగమ్మ ఆలయ రెగ్యులర్ ఉద్యోగస్తులపై కాంట్రాక్టు ఉద్యోగస్తులు పెత్తనం చెల్లాయించడం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. రెగ్యులర్ ఉద్యోగస్తులకు పెండింగ్ పిఆర్సి ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఆలయంలో రెగ్యులర్,కాంట్రాక్టు ఉద్యోగస్తులు గత 5 సంవత్సరాలుగా ఏఏ బ్యాంకులలో సొంత ఖాతాలు తెరిచారు? ఎంతెంత ఆర్థిక లావాదేవీలు జరిపారో బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అక్రమ సంపాదనతో భూములు, ఇండ్లు, ప్లాట్లు ఇటీవల కాలంలో ఏమైనా కొన్నారా అన్న కోణంలో దేవాదాయ శాఖ విచారణ కమిటీ దృష్టి సారిస్తే మరిన్ని నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖలోనైనా కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత బదిలీలు ఉంటాయి కానీ తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో సంవత్సరాల తరబడి ఒకే చోట పనిచేస్తున్నా బదిలీలు చేయకుండా దేవాదాయ శాఖ అధికారుల “కంటికి గంతలు” కట్టుకున్నారా అన్న అనుమానాలు భక్తులలో కలుగుతున్నాయన్నారు.

శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంతో పాటు నగరంలోని దేవాదాయ శాఖకు సంబంధించిన అన్ని గ్రామ దేవతల ఆలయాలపై ప్రత్యేక నిఘా పెట్టి “స్థిర” “చరాస్తులతో” పాటు జమ ఖర్చు ఆలయ బ్యాంక్ అకౌంట్ బంగారు వెండి కానుకల వివరాలను భక్తులకు తెలిసేలా శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. తిరుపతి గంగజాతర సందర్భంగా నగరంలోని అన్ని రకాల వ్యాపారస్తులతో పాటు, ప్రభుత్వాధికారులు,అన్ని వర్గాల ప్రజలు అధికార పార్టీతో సహా వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా వారి వారి ప్రాంతాలలో ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేసి ప్రతి వీధి నుంచి సారే తీసుకువచ్చిన ఖర్చులను సైతం “గంగమ్మతల్లి అకౌంట్” లో వేసేసారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గంగమ్మ తల్లికి జాతర సందర్భంగా భక్తులు భక్తితో ఇచ్చిన ఖరీదైన చీరల పై ఎవరెవరు చేతివాటం ప్రదర్శించారో నిగ్గు తేల్చి వారి వద్ద నుంచి రికవరీ చేయాలన్నారు.

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి,కమిషనర్ సత్వరమే గంగమ్మ ఆలయాన్ని సందర్శించి ఆర్థిక అక్రమ లావాదేవీలపై నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా విచారణ కమిటీ సభ్యులకు ఆదేశాలు ఇవ్వాలని గంగమ్మ తల్లి భక్తుల తరఫున నవీన్ డిమాండ్ చేశారు.

Related posts

ప్రతీకార రాజకీయాల్లోకి కోర్టులను లాగవద్దు

Bhavani

జాతీయ రహదారుల నిర్మాణం త్వరగా చేపట్టాలి

Satyam NEWS

బిచ్కుంద ఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ తహశీల్దార్ కు వినతి

Satyam NEWS

Leave a Comment