30.3 C
Hyderabad
March 15, 2025 11: 01 AM
Slider పశ్చిమగోదావరి

ఏలూరు పంచాయితీల్లో దొంగలు పడ్డారు

#bhimadolu

ఏలూరు జిల్లా భీమడోలు పంచాయతీ లో కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం అయ్యాయని వచ్చిన ఆరోపణల పై సుమారు గత 20 రోజులు గా నూజివీడు డీ ఎల్ పి ఓ నేతృత్వం లో విచారణ సాగుతోంది. జిల్లా నలు మూలల నుండి నిష్పక్షపాతం గా వ్యవహరించే  కొంత మంది పంచాయతీ కార్యదర్శుల తో భీమడోలు పంచాయతీ లో కోట్ల నిధుల దుర్వినియోగం నిగ్గు తేల్చేందుకు  అధికారులు పూనుకున్నారు. భీమడోలు పంచాయతీ లో జరిగిన అవినీతి పై తొలి విడత  విచారణకు 10 మంది కార్యదర్శుల తో విచారణ చేపట్టినట్టు నూజివీడు డీ ఎల్ పి ఓ తెలిపారు.

ప్రస్తుతం మరో కొంత మంది పంచాయతీ సిబ్బంది తో రెండో విడత విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ విచారణ 2019 నుండి 2024 వరకు జరపాలని కొంత మంది చేసిన ఫిర్యాదు పై ఈ విచారణ జరుగుతుందన్నారు.  భీమడోలు పంచాయతీ లో జరిగిన నిధుల దుర్వినియోగం లో వాస్తవాలు తేలాలంటే  ఇంటి పన్ను లు, కుళాయి పన్నులు, వ్యాపార పన్నులు, జమలు, ఖర్చులు, టెండర్ లు, కొనుగోళ్లు కు సంబంధించి బిల్లులు, ఓచర్లు,  ఇలా విభాగాల వారీగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విభాగం అప్పగించి విచారణకు ఆదేశించామని డీ ఎల్ పి ఓ  ఇటీవల సత్యంన్యూస్.నెట్ కి వివరణ ఇచ్చారు.

రాష్ట్ర చరిత్ర లో పంచాయతీ వ్యవస్థ ఆవిర్భావించాక ఇటువంటి విచారణ మునుపెన్నడూ జరగలేదని పంచాయతీ రాజ్ శాఖ  కు చెందిన కొంతమంది  సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కొన్ని పంచాయతీలలో కొంత మంది కార్యధర్సులు పంచాయతీలలో స్పెషల్ ఆఫీసర్ ల పాలన ప్రారంభం నుండి పంచాయతీ ఎన్నికలు జరిగేంత వరకు కొన్ని పంచాయతీ లలో కోట్లాది రూపాయల నిధులు నకిలీ బిల్లులతో దోపిడీ చేశారని ఎన్నో ఆరోపణలు వెల్లు వెత్తాయి. వాటన్నిటిని గుర్తించి భీమడోలు తరహా లోనే  పంచాయతి కార్య ధర్శులతో  విచారణ జరిపిస్తా రా అనే ఆలోచన ప్రతి ఒక్కరి లో మెదులుతుంది.

ఉదా హరణ కు జాలిపూడి పంచాయతీ లో ఇరువురు కార్యదర్శుల తో కలిసి సర్పంచ్ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపించాయి. కార్యదర్శులకు చార్జీ మెమోలు కూడా ఇచ్చారని అనుకున్నారు. ఈ పంచాయతీ నిధుల దుర్వినియోగం లో సర్పంచ్ ఎన్ని లక్షలు కార్య దర్శిలు ఎన్ని లక్షలు దుర్వినియోగం చేశారనేది కొన్ని దిన పత్రికలు వార్తా కథనాలు రాశాయి.

అధికారులు ఇటీవల  సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేసారు. నిధుల దుర్వినియోగం లో సర్పంచ్ తో బాటు కార్యదర్శి ల పాత్ర కూడా ఉన్నట్టు పత్రికలలో స్పష్టం గా రాసినా అధికారులు ఇంత వరకు కార్యదర్శి ల పై చర్యలు చేపట్ట లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్పెషల్ ఆఫీసర్ ల పాలన లో  పెదవేగి మండలం లో ఒక పంచాయతీ లో సంబంధం లేని వేరే పంచాయతీ లో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ఆఫీసర్ మరో పంచాయతీ లో నకిలీ వేలిముద్ర వేసి లక్ష లా ది రూపాయలు డ్రా చేసి దుర్వినియోగానికి పాల్పడితే ఆ అధికారి పై ఇంత వరకు ఏ  ఒక్క అధికారి చర్యలు చేపట్టక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటని పెదవేగి మండల ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అంతే కాదు అదే మండలం లో ఓ  కార్య దర్శి 9 పంచాయతీ లలో సుమారు 3 నుండి 4 కోట్ల రూపాయలు నకిలీ బిల్లుల తో డ్రా చేసి స్వాహా చేశారని అప్పట్లో   విమర్శలు వినిపించాయి. వాటి పై కూడా అధికారులు కనీసం విచారణకు కూడా ఆదేశించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. భీమడోలు పంచాయతీ లో జరుగుతున్న విచారణ మాదిరి గానే  పెదవేగి తోబాటు నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్న ఏలూరు, ఉంగుటూరు, దెందులూరు, జంగా రెడ్డి గూడెం, ద్వారకా తిరుమల ఇలా మండలాల వారీగా అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న కొన్ని పంచాయతీలలో కూడా  పంచాయతీ కార్యదర్శి ల తో విచారణ జరిపించి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ వారి నుండి  రికవరి చేయించాలని కొంత మంది పంచాయతీ రాజ్ ఉద్యోగులే జిల్లా ఉన్నతాధికారులను కోరుతున్నారు.

భీమడోలు పంచాయతీ లో  జరుగుతున్న నిధుల దుర్వినియోగo పై జరుగుతున్న విచారణ  వివరాలను  నూజివీడు డీ ఎల్ పి ఓ ని సత్యం న్యూస్ శుక్రవారం వివరణ కోరగా భీమడోలు పంచాయతీ లో  విచారణ కొన సాగుతుందన్నారు. 2019నుండి 2024వరకు జరిగిన లావాదేవీలను  విభాగాలుగా విభజించి విచారణ జరి పిస్తున్నామని తెలిపారు. ఈ విచారణ కు 22 మంది కార్యదర్శుల సహకారం కావాలని అధికారులను కోరగా తొలి విడత జరిగిన విచారణ కు కేవలం 10 మంది కార్యదర్సులను  మాత్రమే పంపారన్నారు. ఇప్పట్లో తేలేలా లేదని ఇంకా చాలా రికార్డు లు పరిశీలిస్తే గాని నిధులు దుర్వినియోగం అయ్యాయోలేదో చెప్ప లేమని డీ ఎల్ పి ఓ వివరణ ఇచ్చారు.

Related posts

రెండు వారాల ప్రాక్టీస్ ఓరియెంటెడ్ ఇంటర్న్‌షిప్

mamatha

కరోనా డ్యూటీ కానిస్టేబుల్ ఆత్మహత్య

Satyam NEWS

అమరచింత ఎస్ఓను సస్పెండ్ చేయాలి

Satyam NEWS

Leave a Comment