విశాఖపట్నం రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించాలని కృతనిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంకే సమస్యల గురించి పట్టుంకోవడం లేదు. విశాఖపట్నం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా మిలీనియం టవర్-బి నిర్మాణం జరపాలని నిర్ణయించారు.
అందుకోసం తాజాగా నిధులు విడుదల చేశారు. విశాఖలోని మధురవాడ వద్ద నిర్మించే మిలీనియం టవర్-నిర్మాణానికి రూ.19.73 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే టవర్-ఎ నిర్మాణం పూర్తి చేసిన ప్రభుత్వం అక్కడినుంచే సచివాలయ కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తోంది.