హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ సర్కిల్ వాసు వైన్ పాష్ లో శుక్రవారం మద్యాహ్నం కింగ్ పిషర్ లైట్ బీర్లు తీసుకున్న యువకులకు చేదు అనుభవం ఎదురయింది. మొత్తం 5 కింగ్ పిషర్ బీర్లు తీసుకుంటే అందులో రెండింటిలో ఫంగస్ (నాచు) లాంటి పదార్థం తేలియాడుతూ కనిపించింది. అదే వైన్ షాప్ బిల్డింగ్ లోని పర్మిట్ రూమ్ లో బీర్ ల మూతల తీయగా ఫంగస్ కనిపించింది. దింతో ఇది ఎంటి అని ప్రశ్నిస్తే ఓక్కసారి బీర్ బాటిల్ మూత తీస్తే అందులో విషం ఉన్న మాకు సంబంధం లేదు అంటూ నిర్లక్ష్యపు సమాధానాలు ఇచ్చారు. అందరికి మాముళ్ళు ఇస్తాం ఎవ్వరికి ఫిర్యాదు చెస్తారో చేసుకోండి అంటు యువకులపై దబాయింపులకు దిగారు. తప్పును ఎత్తి చూపితే దబాయింపులకు దిగిన యాజమాన్యంతో వాదులాడలేక యువకులు అక్కడి నుంచి వెనుతిరిగారు.
previous post
next post