28.7 C
Hyderabad
April 25, 2024 06: 37 AM
Slider అనంతపురం

లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన జీ20 విదేశీ ప్రతినిధులు

#G20 foreign delegations

శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో వెలసి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయాన్ని జీ20 విదేశీ ప్రతినిధులు సందర్శించారు. మంగళవారం సాయంత్రం కర్ణాటక రాష్ట్రం పావగడ నుంచి లేపాక్షి ఆలయ సందర్శనకు జీ20 విదేశీ ప్రతినిధులు విచ్చేశారు.

ముందుగా లేపాక్షి ఆలయం వద్దకు చేరుకున్న 29 మంది జీ20 విదేశీ ప్రతినిధులకి జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు, తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పూలమాలతో వారికి సత్కరించగా, పూర్ణకుంభంతో జీ20 విదేశీ ప్రతినిధులకి ఆహ్వానం పలికారు.

ఆ తరువాత లేపాక్షి ఆలయంలోకి వెళ్లిన జీ20 విదేశీ ప్రతినిధులుకి అమరావతి సర్కిల్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆర్కియాలజిస్టులు సూర్య ప్రకాష్, కమలహాసన్ లు లేపాక్షి ఆలయ ప్రాశస్త్యం, చరిత్ర, దేవాలయ నిర్మాణం, కట్టడాలు, సభా మండపం, విజయనగర సామ్రాజ్యంలో ఆలయానికి ఉన్న ప్రాధాన్యత, కుడ్య వర్ణ చిత్రాలు, శిల్ప సంపద, వాస్తు నిర్మాణశైలి, వ్యాపార, వాణిజ్య, ఆధ్యాత్మిక కళలకు ఉన్న కీర్తి, ఏకశిలా గణేషుడు, నాగలింగం విశిష్టత, నాట్య

మండపం, సీతమ్మ పాదం, భోజన శాల, వేలాడే స్తంభం, 680 స్తంభాలు, తదితర వివరాలను జీ20 విదేశీ ప్రతినిధులకి తెలియజేశారు.ఈ సందర్భంగా లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన జీ20 విదేశీ ప్రతినిధులు ఆలయం అద్భుతం అని పేర్కొన్నారు. ముఖ్యంగా వేలాడే స్తంభాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. ఏకశిలా గణేషుడు, నాగలింగం విశిష్టత, శిల్పకళా సంపద, చరిత్ర గురించి తెలుసుకొని ఆశ్చర్యచకితులయ్యారు.

రాత్రి పైన రాసిన తెలుగు అక్షరాలను తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. రామాయణ కాలం నాటి చరిత్ర తెలుసుకోగా, జటాయువు పక్షి విగ్రహం చూసి పరవశులయ్యారు. ఏకశిలా గణేషుడు, నాగలింగం, వేలాడే స్తంభం, తదితర స్థలాలలో జీ20 విదేశీ ప్రతినిధులు సెల్ఫీలు దిగారు. లేపాక్షి ఆలయం సందర్శన సందర్భంగా తిలకించిన దృశ్యాలను వారివారి సెల్ ఫోన్ లలో బంధించారు. లేపాక్షి ఆలయాన్ని సందర్శించడం పట్ల వారంతా సంతోషం వ్యక్తం చేశారు.

అనంతరం లేపాక్షి ఆలయం నుంచి బయలుదేరి వెళ్లి అతి పెద్ద ఏక శిలా నంది విగ్రహాన్ని జీ20 విదేశీ ప్రతినిధులు తిలకించారు. జీ20 విదేశీ ప్రతినిధులకి జిల్లా కలెక్టర్, పెనుకొండ సబ్ కలెక్టర్, అమరావతి సర్కిల్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు, తదితరులు వీడ్కోలు పలికారు. జీ20 ప్రతినిధులు లేపాక్షి పర్యటన సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అమరావతి సర్కిల్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్ డా. గోపీనాథ్ జన, డివైఎస్ఏఈ కె. వీరాంజనేయులు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అసిస్టెంట్ సూపరింటెండెంట్ లు డివి.బోయి, పి. శ్రీనివాసరావు, ఏ. భాను ప్రకాష్ వర్మ, అనంతపురం సర్కిల్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కన్జర్వేషన్ అసిస్టెంట్ పి. బాలకృష్ణారెడ్డి, ఏఎస్పీ రామకృష్ణ ప్రసాద్, డిఎస్పీలు భవ్యకిషోర్, టిడి. యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన టివి యాంకర్ లాస్య

Satyam NEWS

మంటలు ఆర్పబోయిన విజయ డ్రైవర్ గురునాథం మృతి

Satyam NEWS

కోడెల చర్యలపై మండిపడుతున్న కమ్మకులస్తులు

Satyam NEWS

Leave a Comment