26.2 C
Hyderabad
February 14, 2025 00: 21 AM
Slider ముఖ్యంశాలు

యాక్షన్: కరోనా క్వారంటైన్ కేంద్రంగా గచ్చిబౌలి స్టేడియం

Gachibowli stadium

కరోనా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలి స్టేడియంను క్వారం టైన్  కేంద్రంగా మార్చేందుకు ఏర్పాట్లు చేపట్టింది. గచ్చిబౌలిలోని స్టేడియంను 50 పడకల క్వారంటైన్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తో పాటు జిహెచ్ఎంసీ అధికారులు స్టేడియంను నేడు పరిశీలించారు.

గచ్చిబౌలి స్టేడియంలోని అథ్లెటిక్ క్రీడా ప్రాంగణంలో గల పరిపాలన విభాగంతో పాటు అందుబాటులో ఉన్న గదులను ఆధీనంలోకి తీసుకుని వైరస్ నివారణ వార్డుల కింద తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేపట్టారు. శేరిలింగంపల్లి సర్కిల్ 11 పారిశుద్ధ్య విభాగం సిబ్బంది స్టేడియంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో గచ్చిబౌలి స్టేడియంను క్వారంటైన్ కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Related posts

హైదరాబాద్ వాసులను ఆకట్టుకుంటున్న కరోనా కారు

Satyam NEWS

వృద్ధాశ్రమంలో LK అద్వానీ జన్మదిన వేడుకలు

Satyam NEWS

అతి – అనర్థం

Satyam NEWS

Leave a Comment