39.2 C
Hyderabad
April 18, 2024 15: 12 PM
Slider అనంతపురం

అనంతపురం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా గడప గడపకు…

#ycp

అనంతపురం జిల్లా పామిడి మండలం పామిడి గ్రామంలో గుప్తా కాలనీ (7వ వార్డు) లో గుంతకల్లు శాసన సభ సభ్యులు వై.వెంకట రామి రెడ్డి, అనంతపురం రూరల్ మండలం పూలకుంట గ్రామంలో రాప్తాడు శాసనసభ సభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి  ఆధ్వర్యంలో నిర్వహించిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాలలో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్  బోయ గిరిజమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గడప గడప తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని తెలియజేసారు. ప్రజలందరూ YSR కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలో చేసిన అభివృద్ధి మరియు అందించిన సంక్షేమ పథకాల ఫలాల గురించి, ప్రభుత్వ పరంగా వారికి కలిగిన లబ్ది గురించి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ తిరిగి YSRCP గెలిపించి మళ్లీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి   ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు.

ఇలాగే సoక్షేమ కార్యక్రమాలు కొనసాగాలని వారి అభిలాషను వ్యక్తం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమoలో YSRCP మండల కన్వీనర్లు, స్థానిక ZPTCలు, MPPలు, Vice MPPలు, సర్పంచులు, MPTCలు, YSRCP ప్రజా ప్రతినిధులు, నాయకులు & కార్యకర్తలు, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు మరియు పెద్ద ఎత్తున ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అదేవిధంగా అనంతపురం జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్ లో జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డు చైర్మన్  అధ్యక్షతన నిర్వహించిన అగ్రి అడ్వైజరీ బోర్డు సమావేశానికి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ మరియు అగ్రి అడ్వైజరీ బోర్డు సభ్యులు  బోయ గిరిజమ్మ  హాజరయ్యారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మరియు మండల వ్యవసాయాధికారులు ప్రస్తుతం వ్యవసాయ పరంగా జరుగుతున్న పురోగతిని సభకు వివరించారు.

కార్యక్రమంలో  బోయ గిరిజమ్మ మాట్లాడుతూ అర్హులైన ఏ ఒక్క రైతు ప్రభుత్వ పథకానికి దూరం కాకుండా చూడాల్సిన భాద్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, RBK సేవలను ప్రతి రైతుకు అందాలని తెలియజేసారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టరు , ADCC బ్యాంక్ చైర్ పర్సన్. వ్యవసాయ శాఖ సిబ్బంది, అగ్రి అడ్వైజరీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్.నెట్ అనంతపురం

Related posts

విజయనగరంలో తగ్గిన పోలీసు “స్పందన” బాధితుల సంఖ్య

Satyam NEWS

అంబర్ పేట్ నియోజకవర్గంలో పార్కుల అభివృద్ధికి చర్యలు

Satyam NEWS

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విజయవంతంగా చలివేంద్రం

Satyam NEWS

Leave a Comment