Slider తెలంగాణ

సిఎం సహాయనిధికి గగన్ దీప్ సింగ్ కోహ్లీ విరాళం

ktr 2610

మంత్రి కెటి రామారావు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం అందింది. హైదరాబాద్ నగరానికి చెందిన గగన్ దీప్ సింగ్ కోహ్లీ, మంత్రి కేటీఆర్ గత ఆరు సంవత్సరాలుగా చేస్తున్న వివిధ కార్యక్రమాలు ద్వారా స్ఫూర్తి పొందానని,ఆయన కార్యక్రమాలకు మరింత బలాన్ని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.  ఈరోజు మంత్రి కేటీఆర్ ని కలిసి చెక్కును అందించారు. ఆపదలో ఉన్న వందలాది మందికి మంత్రి కేటీఆర్ సొంత నిధులతో పాటు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్న తీరుతో ఈ విరాళం అందిస్తున్నట్లు గగన్ దీప్ తెలిపారు. ఈ విరాళం ద్వారా వికలాంగుల కోసం ఏర్పాటైన ప్రత్యేక పాఠశాలలు లేదా పేద విద్యార్థుల కోసం ఉపయోగించాలని అని గగన్ దీప్, మంత్రి కేటీఆర్ ని కోరారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కి భారీ విరాళం ప్రకటించిన గగన్ దీప్ ని మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.

Related posts

పోలీసులతో సమానంగా హోంగార్డుల సేవలు

Satyam NEWS

రామతీర్థం నీలాచలం కొండపైకి చిన జీయర్..!

Satyam NEWS

జగన్ రెడ్డి ప్రభుత్వంపై మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

Satyam NEWS

Leave a Comment