మెగా ప్రిన్స్ రామ్ చరణ్ తేజ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ రేట్లను పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం రాత్రి ఒంటిగంట బెనిఫిట్ షో టికెట్ ధర 600 రూపాయలు ఉంటుంది. జనవరి 10 నుంచి జనవరి 23 వరకు 5 షో లకు టెక్కెట్ రేట్లు పెంపు కు అనుమతి లభించింది. మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 175 రూపాయలు వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 135 రూపాయలు పెంపు ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఇచ్చింది.
previous post