మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ చక్రి పురం కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాధుడి లడ్డూ వేలం పాటలో ఎం. వెంకటేశ్వరరావు 40,000 వేల రూపాయలకు లడ్డు ని కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమం కాలనీ అధ్యక్షుడు మొగిలి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా లడ్డూ వేలం పాటలో కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ లడ్డూను కైవసం చేసుకున్నందుకు కుటుంబసభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాలనీ ప్రధాన కార్యదర్శి ఆకుల ఆంజనేయులు, ఉపాధ్యక్షులు కొండారెడ్డి అశోక్, కోశాధికారి లాల్ సింగ్, అర్జున్ సలహాదారులు మాన్సింగ్, బుచ్చిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు వెంకటేష్, సంతోష్ గుప్తా, ఎర్రయ్య, రవీందర్, వెంకట్ రెడ్డి , లింగం, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.