Slider రంగారెడ్డి

గ్యాంగ్ లీడర్: విశాఖ నుంచి షిర్టీకి గంజాయి స్మగ్లింగ్

rachakonda police

నగర శివారులో ని ఘట్ కేసర్ లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు ను పోలీసులు రట్టు చేశారు. వంశీ నాయక్, రాజ్ నాయక్, రతన్ లాల్ ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. విశాఖపట్నంలో సేకరించిన గంజాయిని ఈ ముఠా వారు షిరిడి కి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

విశాఖపట్నం ధారకొండలో 2 వేలకు కిలో గంజాయిని కొనుగోలు చేసి వీరు హైదరాబాద్ లో 7 వేలకు విక్రయిస్తుంటారు. వివిధ పోలీసు స్టేషన్ లో ఈ నిందితులపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. పట్టుబడ్డ వారి వద్ద నుండి 51కేజీల గంజాయి, 5 వేల నగదు, కారు, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, మాదకద్రవ్యాలు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామమని ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ హెచ్చరించారు.

Related posts

A Big Question: ఎవరు ‘‘పెయిడ్ ఆర్టిస్టులు?’’

Satyam NEWS

షోపియాన్ జిల్లాలో ఎన్ కౌంటర్: ముగ్గురు హతం

mamatha

వనపర్తిలో త్రాగుబోతుల న్యూసెన్స్?

Satyam NEWS

Leave a Comment