దేశంలోని అన్ని విమానాశ్రయాలకన్నా ఒక రోజు ఆలశ్యంగా తెరచుకున్న గన్నవరం విమానాశ్రయం నేడు ప్రయాణీకులతో సందడిగా మారింది. గన్నవరం నుండి బెంగళూరు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. కరోనా వైరస్ కారణంగా శానిటేషన్ అంతరం మాత్రమే ప్రయాణికులను లోపలికి అనుమతిస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో కరోనా వైరస్ పై భద్రత విభాగాన్ని విజయవాడ సబ్ కలెక్టర్ ధ్యాన చంద్ పరిశీలించారు.
లాక్ డౌన్ కారణంగా మార్చి 25 నుంచి గన్నవరం విమానాశ్రయం లో సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ రోజు నుంచి పునఃప్రారంభం కాగా ఎయిరిండియా , స్పైస్ జెట్ , ఇండిగో విమాన సంస్థలు తమ సర్వీసులు నడుపుతున్నాయి. అదే విధంగా బెంగుళూరు నుంచి 79 మంది ప్రయాణీకులు గన్నవరం చేరుకున్నారు. బెంగుళూరుకు 69 మంది ప్రయాణీకులు బయలుదేరి వెళ్లారు.