35.2 C
Hyderabad
April 24, 2024 13: 28 PM
Slider విశాఖపట్నం

స్వంత వర్గాన్ని వైసీపీపై రుద్దేందుకు గంటా ప్లాన్

#ganta

ఉత్తరాంధ్రలో వైసీపీకి ఉన్న నాయకులను కాదని తన మనుషులను వచ్చే ఎన్నికలలో అభ్యర్ధులుగా చేసుకోవడానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇప్పటి నుంచే పకడ్బందిగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా డిసెంబర్ 1వ తేదీన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వైసీపీ లో చేరకముందే ఆయన తన వర్గాన్ని వైసీపీలోకి పంపేందుకు, వారికే టిక్కెట్లు వచ్చేందుకు అన్ని రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని అంటున్నారు.

ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో గంటా వైకాపా లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి బంధువులు ,మిత్రులకు,అనుచరులకు సమాచారం కూడా ఇచ్చేశారు. 2019 విశాఖ ఉత్తరం నుండి వైకాపా నేత కేకే రాజు పై స్వల్ప ఓట్లు తేడాతో గంటా విజయం సాధించారు. గెలిచిన దగ్గర నుండి గంటా టీడీపీ తో అంటి ముట్టనట్టే వ్యహరించారు.

గతంలోనే వైకాపా లోకి వెళ్దాం అనుకున్నా కూడా అప్పటి మంత్రి అవంతి శ్రీనివాస్, ఇప్పటి మంత్రి గుడివాడ అమర్నాధ్, ఎంపీ విజయసాయిరెడ్డి లు అడ్డుతగలడం తో గంటా వైకాపా లోకి చేరలేదు. కానీ జీవీఎంసీ ఎన్నికల ముందు మాత్రం గంటా ముఖ్య అనుచరులు వైకాపా కండువా కప్పేసుకున్నారు.

దీనిపై గంటా కనీసం ఖండించే స్టేట్ మెంట్ లు ఇవ్వలేదు. ఇంతలోనే స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ పై తనదైన శైలిలో రాజకీయం చేద్దాం అనుకున్న గంటా.. క్షణం కూడా ఆలోచించకుండా ఎం.ఎల్.ఏ పదవికి రాజీనామా చేసేశారు. అది ఆమోదం పొందలేదు అదే వేరే విషయం. ఈ లోపు కాపు నాయకులు తో విశాఖ లో పెద్ద ఎత్తున కాపు సమావేశలు నిర్వహించారు…. ఫలితం ఏమి తేలలేదు కానీ కాపులు ఎక్కడ ఉన్నా ఉన్నత పదవుల్లో ఉండాలి అని బడా స్టేట్ మెంట్ ఇచ్చి సమావేశాన్ని ముగించేశారు.

సీన్ కట్ చేస్తే హైదరాబాద్ లో తన మిత్రుడు చిరంజీవి తో గంటా భేటి అయ్యారు. మళ్ళీ నోవాటల్ లో తన పాత మిత్రులను కలవడానికి అంటూ జనసేన అధినేత ను సీక్రెట్ గా భేటి అయినట్టు భోగట్టా. ఉత్తరాంధ్ర జనసేన బాధ్యతలు తన భుజాల పై పెట్టాలని, తన మార్క్ రాజకీయం చూపిస్తాను అని పవన్ తో అన్నట్టు, ఆయన్ని ప్రజారాజ్యం నుండి గమనిస్తున్న పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అంటున్నారు.

దాంతో ఆయన జనసేనలో చేరే ఆలోచన విరమించుకున్నారు. కట్ చేస్తే విశాఖ వైకాపా అధ్యక్షుడు గా ఉన్న మాజీ మంత్రి అవంతి ని తప్పించి గంటా మిత్రుడు పంచకర్ల రమేష్ ను అధ్యక్షుడు ని చేస్తూ జగన్ నిర్ణయం తీసుకోవడం తో గంటా లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది.  పైగా గుడివాడ అమర్నాద్ కు మంత్రి పదవి దక్కడం తో ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. గంటా అంటేనే చీకాకు పడే మరో కీలక నాయకుడు  విజయసాయిరెడ్డి ని విశాఖ బాధ్యతలు నుండి తప్పించడంతో గంటాకు మార్గం సుగమం అయ్యింది.

గంటా వెళ్ళిపోతే టీడీపీ కి భారీ షాక్ అని గంటా తన అనుచరులతో భారీ ఎత్తున ప్రచారం కూడా చేయిస్తున్నట్లు చెబుతున్నారు. గంటా చేరికతో వైకాపా బలం రెట్టింపు అవుతుందని కూడా ప్రచారం తీవ్ర స్థాయిలో జరుగుతున్నది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు తో గంటా కు విభేదాలు ఉన్నాయి. అలాగే గంటా ప్రతి ఎన్నికకు నియోజకవర్గాన్ని మారుస్తారు.

ఆయనతో పాటు ఆయన బంధు గణానికి టికెట్ లు ఇవ్వాలి.. ఇవి గంటా రాజకీయాలు.. గంటా వియ్యంకులు భీమవరం మాజీ ఎం.ఎల్.ఏ టీడీపీ నేత అంజిబాబు పార్టీ లో యాక్టివ్ గా లేరు.. అలాగే ఇంకో వియ్యంకుడు నారాయణ కూడా టీడీపీ లో యాక్టివ్ గా లేరు.. వాళ్లు వ్యాపారులు. మరో మిత్రుడు ప్రత్తిపాటి పుల్లరావు టీడీపీ ని విడేది లేదని స్టేట్ మెంట్ కూడా గతంలో ఇచ్చేశారు. గంటా ఇంకో మిత్రుడు పంచకర్ల గంట కన్నా ముందే వైకాపా లో చేరారు.

దీని వల్ల గంటా టీడీపీ ని వీడి వైకాపా కి వెళ్లినా పెద్ద నష్టం ఏమి లేదు. టీడీపీ సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు, బండారు,పల్లా లాంటి వారిని పార్టీ వదుకోలేదు. గంటా తో రాజకీయం గంటకో రకంగా ఉంటుంది. ఆయాన ఆడిగినవి అన్ని ఇవ్వాలి.. గెలిస్తే మంత్రి పదవి కూడా.. పైగా నియోజకవర్గాన్ని కూడా గంటానే డిసైడ్ చేసుకుంటారు. ఆయన అడిగిన అన్ని సీట్లు కూడా ఇవ్వాలి.

ఇలాంటి వ్యక్తి తో జగన్ ఇమడగలరా.. జగన్ చెప్పేదే వైకాపా ఓ శాసనం… జగన్ ..చంద్రబాబు లా మెతక మనిషికూడా కాదు. అంతే కాకుండా టీడీపీ లో ఉన్నంత స్వేచ్చగా గంటా కు వైకాపాలో ఉంటుంది అనుకోవడం అత్యాశే. ఇక గంటా వైకాపా లోకి వస్తే ..ఉత్తరాంధ్ర ముఖ్యనేతలు ఎలా వ్యవహరిస్తారు అనేదే పెద్ద ప్రశ్న. గంటా అవకాశం వస్తే మొత్తం చుట్టేసి తన మార్క్ ఉండేలా చుసుకుంటారు.

ఉత్తర వైకాపా ఇంచారాజ్ కేకే రాజు, అవంతి, గుడివాడ, ధర్మశ్రీ, బుడి ముత్యాలు నాయుడు తో పాటు బొత్స, ధర్మాన లు కూడా ఎలా స్పందిస్తారో చూడాలి. ఒకవేళ అధినేత మాట జావా దాటకపోయినా గ్రూపు తగాదాలు..ఆధిపత్య పొరులు తప్పవు అనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. మిత్రుడు కంచకర్ల రమేష్ ను విశాఖ తూర్పు నుండి బరీలో దించే ఆలోచన అప్పుడే గంటా ప్రారంభించేశారు.

దీనితో పాటు విశాఖ నార్త్ ఈస్ట్, వెస్ట్, సౌత్, గాజువాక, భీమిలి, అనకాపల్లి, యాలమంచిలి, పెందుర్తి, పాయకరావుపేట గెలుపు భాద్యతలు సైతం గంటా భుజాలు పై పెట్టేలా పక్క ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. గంటా  వైకాపా లోకి వస్తే ఇద్దరు లేదా ముగ్గురు బడనేతలతో పాటు వారి అనుచర గణం మూకుమ్మడిగా ఎన్నికల సమయానికి సైకిల్ ఎక్కే ఆలోచన లో ఉన్నట్టు భోగట్టా. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అని అంటారు మరి వైకాపా వరలో 4 ,5 కత్తులు పడతాయా చూడాలి మరి..

రామకృష్ణ పూడి, విశాఖపట్నం

Related posts

తీరం దాటిన నివ‌ర్‌.. పెను బీభ‌త్సం

Sub Editor

రాహుల్ గాంధీకి దేశ చరిత్ర తెలియదు

Satyam NEWS

‘ఆహా’లో వావ్ అనిపిస్తున్నవిక్రమ్ లగడపాటి “వర్జిన్ స్టోరీ”

Bhavani

Leave a Comment