37.2 C
Hyderabad
March 29, 2024 19: 59 PM
Slider విశాఖపట్నం

గంటా రాక వార్తతో కల్లోలంగా మారిన విశాఖ వైసీపీ

#gantasrinivasarao

విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు వైసీపీలోకి వస్తున్నారనే వార్తలు అక్కడ వైసీపీలో కలకలం సృష్టిస్తున్నాయి. గంటా వైసీపీ తీర్థం తీసుకున్న మరుక్షణమే కొన్ని పెద్ద తలకాయలు వైసీపీ నుంచి వైదొలగుతాయని అంటున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాస రావు విశాఖ నార్త్ నుంచి గెలుపొందారు. ఆ తరువాత కొద్ది కాలం నుంచే గంటా పార్టీ మారుతారనే చర్చ మొదలైంది.

వైసీపీ ముఖ్యనేత విజయ సాయిరెడ్డి ఓపెన్ గా నే ఈ విషయం ప్రకటించారు. కానీ, గంటా పార్టీ మారలేదు. అదే సమయంలో టీడీపీతోనూ దూరంగా ఉంటున్నారు. కొద్ది నెలల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ లేఖ పంపారు. అయితే ఆయన రాజీనామా లేఖను స్పీకర్ ఆమోదించలేదు. దాంతో ఆయన ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. గంటా శ్రీనివాస రావు చాలా రోజులుగా వైసీపీతో టచ్ లో ఉన్నారు. కానీ, స్థానికంగా ఉన్న కారణాలు, అవంతి మంత్రిగా ఉంటూ గంటా రాకను వ్యతిరేకించటంతో వైసీపీలోకి ఎంట్రీ నిలిచిపోయిందని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇక, ఇప్పుడు గంటా మిత్రుడు పంచకర్ల రమేష్ బాబు వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడుగా నియమితులయ్యారు. ఈ నియామకం వెనుక ఎవరు ఉన్నారో తెలియదు కానీ ఆయనే గంటా వైసీపీ ప్రవేశానికి బాటలు వేశారని అంటున్నారు. అప్పటిలో అవంతి తోబాటు విజయసాయి రెడ్డి కూడా గంటాను వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు విశాఖ విషయాలకు సంబంధించి విజయసాయి రెడ్డికి సంబంధం లేకపోవడం, అవంతి మంత్రిగా లేకపోవడం తో గంటా ప్రవేశానికి వీలుకలిగిందని కూడా అంటున్నారు.

ఇప్పుడు గంటా వైసీపీలోకి ఎంట్రీ ఖాయం కావటంతో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందన ఏంటనేది తెలియాల్సి ఉంది. గంటా – అవంతి ఇద్దరూ ఒకప్పుడు మిత్రులు. ఇప్పుడు రాజకీయంగా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. దీంతో, వైసీపీలో ఇద్దరి మధ్య రాజీ జరుగుతుందా..లేక, అవంతి మరో నిర్ణయం తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. తాను వైసీపీలో చేరబోతున్నట్లు సన్నిహితులకు గంటా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తన శ్రేయాభిలాషులతో చర్చలు చేసిన తరువాత మరోసారి చిరంజీవిని కలిసి ఆ వెంటనే నిర్ణయం ప్రకటించాలని గంటా డిసైడ్ అయ్యారు.

డిసెంబర్ తొలి వారంలోనే సీఎం జగన్ విశాఖ కేంద్రంగా సభలో పాల్గొనునున్నారు. ఆ సమయంలో విశాఖలోనే సీఎం జగన్ సమక్షంలో గంటా వైసీపీలో చేరుతారని తెలుస్తోంది. అయితే గంటా శ్రీనివాసరావు ఏ నాడూ కూడా మూడు రాజధానులకు మద్దతు పలకలేదు. ఇలాంటి అవకాశవాదిని పార్టీలో చేర్చుకుంటే ఎలా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గంటా శ్రీనివాసరావు పార్టీలోకి వచ్చిన వెంటనే ఇద్దరు పెద్ద నాయకులు వైసీపీని వీడటం మాత్రం ఖాయంగా కనిపిస్తున్నది.  

Related posts

వర్గీకరణపై నిర్లక్ష్యం వహిస్తే బీజేపీని అడ్డుకుంటాం

Satyam NEWS

వి ఎస్ యులో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి

Satyam NEWS

తెలంగాణ దండోరా నాగర్ కర్నూల్ జిల్లా కమిటీ ఎన్నిక

Satyam NEWS

Leave a Comment