28.2 C
Hyderabad
April 20, 2024 12: 56 PM
Slider జాతీయం

ఛతీస్‌గఢ్‌లో మరో గ్యాస్‌ లీకేజీ ఘటన

#Gas leak

విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటన మరవక ముందే ఛతీస్‌గఢ్‌లో మరో గ్యాస్‌ లికేజీ ఘటన చోటు చేసుకుంది. రాయ్‌గఢ్‌లోని పేపర్ మిల్లులో గ్యాస్ లీకై ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

లాక్‌డౌన్ కారణంగా దాదాపు నెలన్నరోజులుగా పరిశ్రమలు అన్ని మూతపడ్డాయి. ఇటీవల కేంద్రం సడలింపులు ఇవ్వడవంతో దేశంలో పలు పరిశ్రమలు తెరచుకున్నాయి. ఈ క్రమంలో  రాయ్‌గఢ్‌లోని పేపర్ మిల్లు కూడా ప్రారంభమయింది.

గురువారం మధ్యాహ్నం మిల్లులోని ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ఏడుగురు కార్మికులు వెళ్లారు. ట్యాంకులోకి దిగి శుభ్రం చేస్తున్న క్రమంలో గ్యాస్ లీకై అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, పోలీసులు అక్కడికి చేరుకొని.. కార్మికులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ఫారెస్ట్ ఆఫీసర్లు అందరూ హెల్మెట్ ధరించాలి

Satyam NEWS

సీఎం కేసీఆర్‌ అత్యవసర సమావేశం

Murali Krishna

డైవర్షన్: అమ్మఒడి పథకం కోసం దళితులకు శఠగోపం

Satyam NEWS

Leave a Comment