27.7 C
Hyderabad
March 29, 2024 04: 54 AM
Slider ప్రపంచం

పాకిస్తాన్ లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు?

#pakistansmall

సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై అధికార కూటమి, ప్రతిపక్ష మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మధ్య చర్చలు జరగనున్నాయి. అక్టోబర్‌లో సాధారణ ఎన్నికలు జరగవచ్చని స్థానిక మీడియా వర్గాలు చెబుతున్నాయి.

దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ఇది తప్పనిసరి అయింది. ప్రభుత్వం, విపక్షాల మధ్య చర్చలకు సైన్యం మధ్యవర్తిత్వం వహిస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పంజాబ్ ఉపఎన్నికల్లో PTI గెలిచిన తర్వాత, PML-N నాయకుడు, హోం మంత్రి రాణా సనావుల్లా లాహోర్‌లో మీడియాతో మాట్లాడుతూ, “త్వరలో సాధారణ ఎన్నికలు నిర్వహించవచ్చు, అయితే సంకీర్ణ పార్టీలతో చర్చల తర్వాత మాత్రమే ఈ విషయం నిర్ణయించబడుతుంది’’ అన్నారు.

“ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) పర్యవేక్షణలో మాత్రమే దేశంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని గతంలో ఇమ్రాన్ ఖాన్ అన్నారు. కావాల్సిన ప్రభుత్వాలను కుట్రలు పన్ని పడగొట్టి ఇప్పుడు భారం ప్రజలపై రుద్దుతున్నారని ఆరోపించారు.

కాబట్టి వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలి. లేకుంటే ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది అని ఆయన అన్నారు. ఈ విషయంపై ఇమ్రాన్ మాట్లాడుతూ మూడున్నరేళ్లుగా తన ప్రభుత్వంపై  ఆరోపణలు చేస్తూనే ఉన్నారని అది కొత్త కాదని అయితే ఇప్పుడు న్యాయమైన సీఈసీ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలన్నదే నా డిమాండ్ అని అన్నారు. కుట్రతోనే పీటీఐ ప్రభుత్వాన్ని కూల్చారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.

దీనిపై విచారణ జరిపేందుకు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తన ప్రభుత్వానికి ఆటంకాలు సృష్టించడం వల్లే దేశంలో చాలా సమస్యలు పుట్టుకొచ్చాయని ఆయన మీడియాతో అన్నారు.

Related posts

శ్రమించి పనిచేసే టిఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు తప్పక గుర్తింపు

Satyam NEWS

వి ఎస్ యూనివర్సిటీలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

Satyam NEWS

BJYM ఆధ్వర్యంలో బిచ్కుంద మండలలో నిరసన కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment