వైయస్ ఆర్ జిల్లా వేంపల్లి పట్టణ శివారులో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. హతుడిని వల్లూరు మండలం పైడికాలవ పంచాయితీ సీతోరుపల్లికి చెందిన పంగా రామయ్య గుర్తించారు. ఎవరో దుండగులు అతడిని కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించి వేంపల్లి సమీపం లో ఉన్న పంట పొలాల్లో వేశారు. డీఎస్పీ మురళి నాయక్ వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. వేంపల్లి సీఐ నరసింహులు, పులివెందుల సిఐలు చాంద్ భాష, వెంకటరమణ కూడా ఆయనతో ఉన్నారు. దీన్ని హత్యగా భావిస్తున్నామని డిఎస్పీ మురళి నాయక్ తెలిపారు. నిందితులను రెండు మూడు రోజుల్లో పట్టుకుంటామని ఆయన వివరించారు.
previous post
next post