35.2 C
Hyderabad
April 24, 2024 13: 56 PM
Slider హైదరాబాద్

110 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం

kcr meeting

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 110 స్థానాల్లో గెలవబోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తమ సర్వేల్లో ఇది తేలిందని తెలిపారు. జీహెచ్ఎంసీ సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. టీఆర్ఎస్ నేతలకు ఏ డివిజన్ లో బాధ్యతలను అప్పగించినా.. పూర్తి బాధ్యత వహించి గట్టిగా పని చేయాలని అన్నారు. బీజేపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.

 ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా రైల్వే, ఎల్ఐసీ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులను కలుపుకొని వెళ్లాలని సూచించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన పార్టీ సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ రెండో వారంలో బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో హైదరాబాదులో సమావేశం ఏర్పాటు చేస్తామని, మమతా బెనర్జీ, కుమారస్వామి, అఖిలేశ్ యాదవ్, స్టాలిన్ వంటి నేతలు ఈ సమావేశానికి హాజరవుతారని చెప్పారు.

టీఆర్ఎస్ మేనిఫెస్టో

నగరంలో కొత్తగా 4 ఆడిటోరియాల నిర్మాణం

అన్ని గ్రంథాలయాల ఆధునికీకరణ

రూ. 130 కోట్లతో 200 ఆదర్శ సమీకృత మార్కెట్లు

నగరమంతా ఉచిత వైఫై సదుపాయం

రూ. 1900 కోట్లతో మరో 280 కి.మీ. మేర మిషన్ భగీరథ పైప్ లైన్

మూసీ సుందరీకరణ.. హుస్సేన్ సాగర్ శుద్ధికి ప్రణాళిక.

Related posts

పోలీసు అధీనంలో మేళ్లచెరువు: 400 మంది తో పటిష్ట పోలీస్ బందోబస్తు

Satyam NEWS

కామారెడ్డి పట్టణాభివృద్ధికి 20 కోట్ల నిధులు మంజూరు

Satyam NEWS

ఫస్ట్ టైం:మహిళా పోలీసుల కోసం మొబైల్ టాయిలెట్

Satyam NEWS

Leave a Comment