29.2 C
Hyderabad
October 10, 2024 18: 54 PM
Slider తెలంగాణ

బ‌ల్దియా రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌కు వైద్య బీమా సౌక‌ర్యం

GHmC

జిహెచ్ఎంసీలోని 5,156 మంది శాశ్వ‌త ఉద్యోగులు, వారి కుటుంబ స‌భ్యుల‌కు వైద్య బీమా సౌక‌ర్యాన్ని వ‌ర్తింప‌జేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఉద్యోగి, త‌న భ‌ర్త లేదా భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు, త‌ల్లిదండ్రులు మొత్తం ఆరుగురికి వైద్య బీమా ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌చేశారు. న‌వంబ‌ర్ 1వ తేదీ నుండి అమ‌లులోకి వ‌చ్చే ఈ బీమా సౌక‌ర్యంలో భాగంగా ఒకొక్క‌రికి క‌నీసం మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల విలువ‌గ‌ల వైద్య బీమాను వ‌ర్తింప‌చేస్తున్నారు. అయితే జిహెచ్ఎంసిలో ఉన్న 5,156 మంది రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌కుగాను కేవ‌లం 2,375 మంత్రమే త‌మ కుటుంబ‌, ఉద్యోగ వివ‌రాల‌ను అంద‌జేశార‌ని మిగిలిన ఉద్యోగులంద‌రూ ఈ నెల 30వ తేదీలోగా త‌మ కుటుంబ స‌భ్యుల వివ‌రాల‌ను అంద‌జేయాల‌ని జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్ కోరారు. ఇందుకుగాను ప్ర‌త్యేకంగా రూపొందించిన ప్రొఫార్మా ద్వారా మెడిక‌ల్ హెల్త్ స్కీం వ‌ర్తింప‌చేసేందుకు వివ‌రాల‌ను వెంట‌నే అందించాల‌ని కోరారు.

Related posts

ఇడుపులపాయలో విద్యార్ధి ఆకస్మిక మృతి

Bhavani

తిరుమలలో అవినీతి రాజ్యమేలతావుంది

Murali Krishna

కొల్లాపూర్ ఎంపిడిఓ కార్యాలయ పరిధిలోని సెటర్లకు ఓపెన్ టెండర్ నిర్వహించాలి

Satyam NEWS

Leave a Comment