30.7 C
Hyderabad
April 24, 2024 01: 05 AM
Slider హైదరాబాద్

ప్ర‌భుత్వ భ‌వ‌నాలు పాడు చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు

ghmc ele

‘ఎన్నికల సందర్భంగా ప్ర‌భుత్వ భ‌వ‌నాలు పాడుచేస్తే ఊరుకోబోమ‌ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అలాగే సిటీలో గోడలపై రాతలు, పోస్టర్లు అతికించడం చేయ‌వ‌ద్ద‌ని జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ స్పష్టంచేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్‌ వాడకాన్ని నివారించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని లోకేశ్‌కుమార్ గురువారం విడుదల చేశారు.

ఈసీ నిబంధనలు

వీలైనంత మేరకు ప్లాస్టిక్‌,పాలిథిన్‌ పోస్టర్లు/బ్యానర్ల వాడకాన్ని నివారించాలి.
ఎన్నికల కరపత్రం,పోస్టరుపై ఆ ప్రింటరు, పబ్లిషర్‌ పేర్లు, చిరునామా తప్పక ముద్రించాలి.
గోడలపై రాతలు, పోస్టర్లు, పేపర్లు అంటించడం, ప్రభుత్వ ఆస్తులు పాడుచేయుటం నిషేధం.


పోలింగ్‌ ముగియడానికి 48గంటల ముందు నుంచి అభ్యర్థి తన ప్రచారానికి టీవీ, సినిమా తదితర ప్రచార సాధనాలు వినియోగించొద్దు.


లౌడ్‌ స్పీకర్లు వాడడానికి తప్పనిసరిగా పోలీసు అధికారుల అనుమతి తీసుకోవాలి.


బహిరంగ సమావేశాలు, రహదారి ప్రదర్శనల్లో ఉదయం 6నుంచి రాత్రి 10 గంటల వరకు, ఉదయం 10 నుంచి సా॥ 6 వరకే లౌడ్‌స్పీకర్లు అనుమతిస్తారు.


ఉదయం 6 గంటలకు ముందు.. రాత్రి 10 దాటాక బహిరంగ సభలు నిర్వహించొద్దు.


అధికారిక యంత్రాంగం ద్వారా ఓటర్లకు అధికారిక ఫోటో గుర్తింపు స్లిప్‌ జారీచేస్తారు. అభ్యర్థులు అనధికారకంగా ఇవ్వొద్దు.

Related posts

రైతు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

Satyam NEWS

కృష్ణా నది తీర గ్రామ ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక

Satyam NEWS

కరోనా నివారణకు ఇంటింటికీ శానిటైజర్లు పంపిణీ

Satyam NEWS

Leave a Comment