22.2 C
Hyderabad
December 10, 2024 10: 50 AM
Slider హైదరాబాద్

జి హెచ్ ఎం సి కి కేటాయింపు పై మేయర్ హర్షం

#vijayalaxmi

రాష్ట్ర బడ్జెట్ లో జి హెచ్ ఎం సి సమగ్ర అభివృద్ధికి  ప్రభుత్వం 3065 కోట్లు కేటాయించిన నేపథ్యంలో జి హెచ్ ఎం సి మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి,రాష్ట్ర ముఖ్యమంత్రి కి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుకి ధన్యవాదాలు తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో రాష్ర్ట ప్రజలకు  అన్ని రంగంలో అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా బడ్జెట్ లో కేటాయించడం మంచి పరిమాణం అని అన్నారు హైదరాబాద్ మౌలిక సదుపాయాలకు మొత్తం అభివృద్ధి 10 వేలకోట్లు కేటాయించడం పట్ల  హైదరాబాద్ అభివృద్ధి కి పెద్ద పీట వేశారని  మెరుగైన రవాణా వ్యవస్థ ను మెరుగుకు మెట్రో రైలు విస్తరణ కూడా బడ్జెట్ లో  ప్రాధాన్యత   నివ్వడం జరిగిందని ఎన్నో ఏళ్ల నుండి మూసి నడి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు  మురికి  కూపంగా  ఉండడం వలన  వర్ష కాలంలో ఇబ్బందులు వ్యాధులు ప్రభాలి అనారోగ్యం తో బాధ పడుతున్నరని మూసి అభివృద్ధికి కూడా 1500 కోట్లు కేటాయించి అభివృద్ధి దోహద పడే విధంగా నిధులు కేటాయించడం శుభ పరిణామం అని మేయర్,  ధన్యవాదాలు తెలిపారు  హైదరాబాద్ నగరం పూర్తి స్థాయి అభివృద్ధి చెంది అంతర్జాతీయ నగరంగా ప్రసిద్ధి గాంచిన నగరంగా హైదరాబాద్ నగరం గుర్తింపు పొందే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు.

Related posts

ఏపీ లో పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు అమలు

Satyam NEWS

పంచాయితీ ఎన్నిక‌లు…ఖాకీల హెచ్చ‌రిక‌….ఎలాగంటే…?

Satyam NEWS

కృతజ్ఞత లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ

Bhavani

Leave a Comment